Business Ideas: జస్ట్ రూ. 2 లక్షల పెట్టుబడితో ఉన్న ఊరిలోనే, నెలకు లక్షన్నర వరకూ ఆదాయం సంపాదించే బిజినెస్ ఇదే

By Krishna AdithyaFirst Published Aug 17, 2022, 5:43 PM IST
Highlights

ప్రధాని మోదీ అందిస్తున్న ముద్ర రుణాలతో దేశంలో యువత అనేక మంది తమ సొంత కాళ్లపై నిలబడి వ్యాపారాలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు సైతం తమ సొంత వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవడం కోసం ముద్ర రుణాల బాటపట్టారు. అయితే ఏ రంగంలో వ్యాపారం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా, అయితే అందుకు మంచి ఆన్సర్ మా వద్ద ఉంది. ఫుడ్ వ్యాపారం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

ఫుడ్ బిజినెస్ లో చక్కటి రుచి, నాణ్యత మెయిన్ టెయిన్ చేస్తే చాలు, కస్టమర్లు వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు. అలాంటి వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ప్రస్తుతం నగరాల నుంచి గ్రామస్థాయి వరకూ పాకింది. ఈ నేపథ్యంలో వెజ్ పఫ్స్, ఎగ్ పఫ్స్, చికెన్ పఫ్స్ తినే వారి సంఖ్య కూడా బాాగా పెరిగిపోయింది. దీన్నే వ్యాపార ఆవకాశంగా మలుచుకోవచ్చు. 

ఇక పఫ్స్ వ్యాపారం విషయానికి వస్తే మార్కెట్లో ప్రస్తుతం ఒక్కో పఫ్ 15 రూపాయలు ధర పలుకుతోంది. ముడి సరుకులు పోనూ, మీరు హోల్ సేల్ గా బేకరీలకు 10 రూపాయలకు విక్రయించవచ్చు. వెజ్, ఎగ్, పన్నీర్, చికెన్ ఇలా వెరైటీలను బట్టి ధర నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ స్నాక్ ఫుడ్ తయారీ యూనిట్ కు ఏమేం కావాలో తెలుసుకుందాం. 

ముందుగా 500-800 చదరపు అడుగుల ఖాళీ గది అవసరం అవుతుంది. లేదంటే 100 గజాల స్థలం ఉన్నా ఈ యూనిట్ స్థాపించవచ్చు. అలాగే కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ కూడా అవసరం. ఇక పఫ్స్ తయారీకి కావాల్సిన మెషీన్స్ విషయానికి వస్తే, డఫ్ మేకింగ్ మెషిన్ కావాలి. ఇందులోనే పిండి ఆటోమేటిగ్గా కలుపుకోవచ్చు. దీని ధర రూ. 20 వేల నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే కమర్షియల్ ఓవెన్ అవసరం అవుతుంది. ఇందులోనే పఫ్స్ బేక్ చేస్తారు. దీని ధర సుమారు. రూ. 50 వేల నుంచి ప్రారంభమై రూ. 2 లక్షల వరకూ ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిలో కూడా బట్టీ ఏర్పాటు చేసుకొని పఫ్స్ బేక్ చేయవచ్చు. అయితే దీనికి మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం ఉంటుంది. 

ఇక పెట్టుబడి విషయానికి వస్తే మొత్తం మెషినరీ ఖర్చు దాదాపు రూ.2 లక్షల వరకూ ఉంటుంది. అలాగే మీరు హోల్ సేల్ గా ఎగ్ పఫ్, కర్రీ పఫ్, చికెన్ పఫ్స్ ను తయారు చేసి థియేటర్లు, కాలేజీ క్యాంటీన్లు, బేకరీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు సప్లై చేయవచ్చు. తద్వారా మీకు మంచి ఆదాయం లభిస్తుంది. అలాగే ఆర్డర్లు సైతం రెగ్యులర్ గా వస్తాయి. 

ఇక లాభం విషయానికి వస్తే మీకు ఒక కోడి గుడ్డు ధర రూ. 5 రూపాయల వరకూ ఉంటుంది. అయితే ఎగ్ పఫ్ లో సగం కోడిగుడ్డు మాత్రమే వాడుతారు. అంటే ఒక కోడి గుడ్డుతో రెండు ఎగ్ పఫ్స్ తయారు చేయవచ్చు. ఈ లెక్క 5 రూపాయల పెట్టుబడికి మీకు రూ.20 లభిస్తాయి.మీరు ఆర్డర్లను బట్టి  రోజు కనీసం 1000 పఫ్స్ తయారు చేసి సులభంగా విక్రయించవచ్చు. ఒక్కో ఎగ్ పఫ్ ధర టోకుగా రూ. 10 అనుకున్నా మీకు ఒక రోజుకు రూ.10 వేల వరకూ లభిస్తాయి. ముడిపదార్థాలు, ట్రాన్స్ పోర్ట్, లేబర్, కరెంటు ఖర్చులు కనీసం సగం పోయినా మీకు రోజుకు 5 వేలు మిగులుతాయి.  ఈ లెక్కన చూస్తే నెలకు 

కోడిగుడ్లు, మైదా పిండి, ఆయిల్, చికెన్, ఉల్లిపాయలు, కూరగాయల ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. వీటిని టోకుగా కొనుగోలు చేస్తే మేలు. అలాగే సొంత వెహికిల్ ఉంటే మీకు మరింత లాభం.

click me!