హెచ్చరిక: మీకు పిఎఫ్ ఖాతా ఉందా.. అయితే వెంటనే ఆధర్ తో లింక్ చేయండి.. లేదంటే ?

By asianet news teluguFirst Published Jun 1, 2021, 3:51 PM IST
Highlights

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ఖాతాదారులకు నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పు పి‌ఎఫ్ ఖాతాదారుడి పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది.

 కరోనా కాలంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది  ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) డబ్బును కూడా ఉపసంహరించుకోవలసి వచ్చింది. కానీ పిఎఫ్ ఖాతా గురించి నిర్దిష్ట సమాచారం లేని కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ఖాతాదారులకు నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పు పి‌ఎఫ్ ఖాతాదారుడి పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.

ఇపిఎఫ్‌ఓ కొత్త నియమం ప్రకారం, పిఎఫ్ ఖాతా ఆధార్ కార్డుకు లింక్ తప్పనిసరి. ఈ నియమం ఈ రోజు నుండి అంటే జూన్ 1 నుండి అమల్లోకి వచ్చింది. మీ ఖాతా ఆధార్‌తో అనుసంధానించబడకపోతే, పిఎఫ్ ఖాతాకు వచ్చే పి‌ఎఫ్ సహకారం ఆపివేయబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎలక్ట్రానిక్ చలాన్ అండ్ రిటర్న్ (ECR)నింపబడదు.

 ఈ‌పి‌ఎఫ్‌ఓ  అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు మీ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. మొదట మీరు ఈ‌పి‌ఎఫ్‌ఓ  ​​వెబ్‌సైట్‌కు వెళ్లండి. ఇందు  కోసం క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

ఇప్పుడు మీ యూ‌ఏ‌ఎన్ నంబర్ అలాగే పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

also read కోవిడ్ సంక్షోభం: సెలవులతో కాస్ట్ కటింగ్‌.. వ్యూహాత్మకంగా ఇండిగో అడుగులు ...

తరువాత 'మ్యానేజ్' విభాగంలో కే‌వై‌సి ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఇక్కడ మీ ముందు ఓపెన్ అయిన పేజీలో మీ ఇపిఎఫ్ ఖాతాతో లింక్ చేయడానికి చాలా డాక్యుమెంట్స్ చూపిస్తుంది.

ఇక్కడ ఆధార్ ఆప్షన్ ఎంచుకుని, మీ ఆధార్ నంబర్ అలాగే మీ పేరును ఆధార్ కార్డులో ఉన్నట్లుగా టైప్ చేసి, సేవపై క్లిక్ చేయండి.

దీని తరువాత, మీరు ఇచ్చిన సమాచారం సేవ్ అవుతుంది, మీ ఆధార్ యూ‌ఐ‌డి‌ఏ‌ఐ డేటాతో ధృవీకరించబడుతుంది.

మీ కే‌వై‌సి డాక్యుమెంట్స్ సరైనవి అయిన తర్వాత, మీ ఆధార్ మీ పి‌ఎఫ్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. మీ ఆధార్ సమాచారం ముందు మీరు వ్రిటెన్ వేరిఫై  పొందుతారు.

మిస్డ్ కాల్‌తో పిఎఫ్ బ్యాలెన్స్‌ను కనుగొనండి 
\మీరు మిస్డ్ కాల్ చేయడం ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు మీ పిఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ నుండి 011-22901406 కు మిస్డ్ కాల్ చేయాలి. దీని తరువాత మీకు మీ ఖాతాలో ఉన్న పిఎఫ్ డబ్బు గురించి సమాచారం వస్తుంది.

click me!