గుడ్ న్యూస్ ఇకపై మూడు రోజుల్లోనే పి‌ఎఫ్ విత్ డ్రా..

By Sandra Ashok KumarFirst Published Jun 11, 2020, 2:05 PM IST
Highlights

ఇలాంటి సంక్షోభం సమయంలో రిటైర్మెంట్ ఫండ్స్ బాడీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ‌ఐ) ఆధారిత ఫుల్ ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ సిస్టం ఉండాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది.  ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఏర్పాటు అయిన ఈ విధానం ద్వారా దాదాపు 54 శాతం కోవిడ్-19 క్లెయిమ్స్ ఇప్పుడు ఆటో మోడ్‌లోనే పరిష్కారం అవుతున్నాయని ఈ‌పి‌ఎఫ్‌ఓ తెలిపింది.
 
న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ సమయంలో పిఎఫ్ ఉపసంహరణ సంఖ్య గణనీయంగా పెరగడంతో, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ విషయంపై అధిక భారం పడుతోంది. ఈ‌పి‌ఎఫ్‌ఓ కార్యాలయాలలో ఉద్యోగుల కొరత ఏర్పడటంతో పెన్షన్ విత్ డ్రాలు ఆలస్యం అవుతున్నాయి.

ఇలాంటి సంక్షోభం సమయంలో రిటైర్మెంట్ ఫండ్స్ బాడీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ‌ఐ) ఆధారిత ఫుల్ ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ సిస్టం ఉండాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది.  ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఏర్పాటు అయిన ఈ విధానం ద్వారా దాదాపు 54 శాతం కోవిడ్-19 క్లెయిమ్స్ ఇప్పుడు ఆటో మోడ్‌లోనే పరిష్కారం అవుతున్నాయని ఈ‌పి‌ఎఫ్‌ఓ తెలిపింది.

also read ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లకు నో యూజ్..సేవింగ్స్ ఎకౌంట్..కారణం..

సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, కోవిడ్-19 పి‌ఎఫ్ విత్ డ్రా వ్యవధి సుమారు 10 రోజుల సమయం పట్టేది. కానీ ఈ ఏఐ సౌకర్యం వల్ల కేవలం 3 రోజుల్లోనే పి‌ఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. 

గతేడాది ఏప్రిల్, మే నెలల్లో 33.75 లక్షల మంది పి‌ఎఫ్ విత్ డ్రా చేసుకోగా.. ఈ ఏడాది కేవలం ఈ 2 నెలల్లో 36 లక్షల మంది పైగా విత్ డ్రా చేసుకున్నారు.  "కోవిడ్-19 పి‌ఎఫ్ పరిష్కారంలో కొత్త ప్రమాణాలను సాధించడంలో కృత్రిమ మేధస్సు(ఏ‌ఐ) వాడకం పెద్ద పాత్ర పోషించింది" అని ఇపిఎఫ్‌ఓ తెలిపింది.

ప్రతిరోజూ 270 కోట్ల విలువైన 80,000 పి‌ఎఫ్ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి ఆటోమేషన్ ఇప్పుడు ఈ‌పి‌ఎఫ్‌ఓకి సహాయం చేస్తోంది.
 
click me!