ఐసీఐసీఐ కుంభకోణం: చందా కొచ్చర్ ఇంట్లో ఈడీ సోదాలు

By Siva KodatiFirst Published Mar 1, 2019, 1:02 PM IST
Highlights

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు నిర్వహించింది. నిబంధనలకు విరుద్దంగా వీడియోకాన్ సంస్ధకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం మంజూరు చేసింది. 

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు నిర్వహించింది. నిబంధనలకు విరుద్దంగా వీడియోకాన్ సంస్ధకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం మంజూరు చేసింది.

ఈ వ్యవహారంలో చందా కొచ్చర్ కీలకపాత్ర పోషించారని ఈడీ ఆరోపించింది. దీనిలో భాగంగా ఇప్పటికే చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలో శుక్రవారం చందా కొచ్చర్‌తో పాటు వేణుగోపాల్ ధూత్‌ ఇంటిపైనా ఈడీ తనిఖీలు నిర్వహించింది. ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఐదు కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లు ఈడీ అధికారులు తలిపారు.

2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసేందుకు గాను క్విడ్‌ప్రోకో ప్రాతిపదికన చందా కొచ్చర్ సాయం చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

ఈ వ్యవహారంలో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. దానితో పాటు సీఈవో హోదాలో ఆమె పొందని ఇంక్రిమెంట్లు, బోనస్‌లు మొదలైనవి వెనక్కి తీసుకుంటున్నట్లు ఐసీఐసీఐ బోర్డు ప్రకటించింది. ఈ కుంభకోణం కారణంగా బ్యాంక్‌కు రూ.1,730 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 
 

click me!