మార్కెట్లో బంపర్ ఎంట్రీ ఇచ్చిన E Factor Experiences IPO...ఒక్కో షేరుపై 53 శాతం లాభం...

Published : Oct 09, 2023, 04:33 PM IST
మార్కెట్లో బంపర్ ఎంట్రీ ఇచ్చిన E Factor Experiences IPO...ఒక్కో షేరుపై 53 శాతం లాభం...

సారాంశం

E Factor Experiences IPO Listing:  ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఇ ఫ్యాక్టర్ ఎక్స్‌పీరియన్స్ ఐపీవో బంపర్ హిట్ అయ్యింది. కంపెనీకి చెందిన షేర్లు ఈరోజు స్టాక్ మార్కెట్లో  రూ. 115 ధర వద్ద లిస్టింగ్  నమోదు చేయగా, IPO పెట్టుబడిదారులు 53 శాతం లిస్టింగ్ లాభం పొందారు.

E Factor Experiences IPO Listing: ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఇ ఫ్యాక్టర్ ఎక్స్‌పీరియన్స్ షేర్లు ఈరోజు మార్కెట్‌లోకి బలంగా ఎంట్రీ ఇస్తూ లిస్ట్ అయ్యాయి. ప్రపంచ మార్కెట్ల ఒత్తిడి కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు క్షీణతతో ప్రారంభమైనప్పటికీ, ఈ రోజు బలహీనమైన మార్కెట్‌లో కూడా కంపెనీ షేర్లు NSE SME ప్లాట్‌ఫారమ్‌లో బంపర్ లిస్టింగ్ చోటు చేసుకుంది.  కంపెనీకి ఇప్పటికే ఇన్వెస్టర్ల నుంచి గట్టి స్పందన లభించింది. కంపెనీ IPO మొత్తం 73 రెట్లు ఎక్కువ సబ్‌స్క్రైబ్ కావడానికి ఇదే కారణం. ఈ IPO ద్వారా 75 రూపాయల ధరతో షేర్ల అమ్మకానికి  జారీ చేశారు. 

నేడు  ఇ ఫ్యాక్టర్ ఎక్స్‌పీరియన్స్ షేరు NSE SMEలో  రూ. 115 ధర వద్ద లిస్టింగ్  నమోదు చేసింది. అంటే IPO పెట్టుబడిదారులు 53 శాతం లిస్టింగ్ లాభం పొందారు. బలహీన మార్కెట్‌లో నమోదైన తర్వాత కూడా జోరు అలాగే కొనసాగింది. షేర్ల ధర రూ. 120.75 ఎగువ సర్క్యూట్‌కు చేరుకుంది, అంటే ప్రస్తుతం IPO పెట్టుబడిదారులు 61 శాతం లాభాలను ఆర్జిస్తున్నారు.

E Factor Experiences IPO వివరాలు..

రూ. 25.92 కోట్ల IPO సెప్టెంబర్ 27, అక్టోబర్ 3 మధ్య సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడింది. ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి గట్టి స్పందన లభించింది. మొత్తంమీద ఈ IPO 73.14 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇందులో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) వాటా 46.09 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్‌ఐఐ) వాటా 168.26 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 47.78 రెట్లు. ఈ ఐపీఓ కింద రూ.10 ముఖ విలువ కలిగిన 34.56 లక్షల కొత్త షేర్లను జారీ చేశారు.

E Factor Experiences Limited 2006లో భారతీయ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా స్థాపించారు. E Factor Experiences Ltd ఈవెంట్ సర్వీసెస్, టెక్నాలజీ ఆధారితమల్టీమీడియా లైట్, సౌండ్ ఇన్‌స్టాలేషన్స్. ప్రత్యేకమైన టర్న్‌కీ ఈవెంట్ అసైన్‌మెంట్‌ సేవలను అందిస్తుంది; వివాహ నిర్వహణ. సామాజిక ఈవెంట్ సొల్యూషన్స్ పాటు సంస్థ ఢిల్లీ, నోయిడా, జైపూర్, ఒడిశాలో 32 మంది ఉద్యోగుల బృందంతో తన కార్యాలయాలను కలిగి ఉంది. E Factor Experiences Limited నిర్వహించే కొన్ని ప్రధాన ఈవెంట్లలో డాట్ ఫెస్ట్ ఎకో రిట్రీట్ (ఒడిశా), భువనేశ్వర్, దీపోత్సవ్, కాశీ, బాబా సాహెబ్-గ్రాండ్ మ్యూజికల్ షో ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్‌మెంట్ ,  హాస్పిటాలిటీ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న అన్‌టామ్డ్ లీజర్ & హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌లో కంపెనీ ఇటీవల 46.33% వాటాను కొనుగోలు చేసింది;  

ఈ కంపెనీని జై ఠాకూర్, సమీర్ గార్గ్ ,  మానికా గార్గ్ ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ 99.99% ఉంది.  అయితే, తాజా షేర్ల ఇష్యూ తర్వాత, ప్రమోటర్ ఈక్విటీ హోల్డింగ్ షేర్ 73.59%కి తగ్గుతుంది. తాజా ఇష్యూ నిధులను కంపెనీ తన అనుబంధ సంస్థలలో పెట్టుబడి పెట్టడానికి, కొన్ని రుణాలు తీసుకోవడానికి,  వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
Silver ETF: వెండిని ఇలా తెలివిగా కొనండి.. ఇష్టం ఉన్న‌ప్పుడు, ఒక్క క్లిక్‌తో అమ్ముకోవ‌చ్చు