దసరా పండగ సందర్భంగా కొత్త వాహనాలు కొనడం ఆనవాయితీ, మీరు కొత్త పల్సర్ బైక్ కొనాలని చూస్తున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్లో విడుదలైన సరికొత్త మోడల్ బైక్ Bajaj Pulsar N150 ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Bajaj Pulsar N150 : బజాజ్ ఆటో తన లైనప్‌లో మరో పల్సర్‌ని చేర్చుకుంది. కొత్త బైక్ పల్సర్ N150. వచ్చే ఏడాది చివరి వరకూ బజాజ్ సంస్థ నుంచి మొత్తం 6 కొత్త పల్సర్ బైకులు విడుదల కానున్నాయి. ఇందులో పల్సర్ ఎన్ 150 రూపంలో మొదటి బైక్ భారత మార్కెట్లో ఇప్పటికే విడుదలైంది. కొత్త బజాజ్ పల్సర్ ధర రూ. 1.18 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ఈ కొత్త బైక్ బజాజ్ పల్సర్ లైనప్‌లో 13వ మోడల్. అసలు పల్సర్ P150 తర్వాత 150cc సెగ్మెంట్‌లో ఇది మూడవ పల్సర్. కొత్త బైక్‌ను పల్సర్ లైనప్‌లో చేర్చిన తర్వాత కంపెనీ దాని ప్రస్తుత పల్సర్‌లలో దేనినైనా మార్కెట్ నుంచి విత్ డ్రా చేస్తుందా లేదా అనే సమాచారాన్ని ఇప్పటి వరకు బజాజ్ ఇవ్వలేదు.
undefined
Bajaj Pulsar N150 ఇంజిన్ మైలేజ్: బజాజ్ పల్సర్ P150 వలె, కొత్త పల్సర్ N150 సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ 149.68cc ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 14.3 బిహెచ్‌పి పవర్ 13.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తాజా పల్సర్ ఎన్150 ఇంధన సామర్థ్యం పాత పల్సర్ 150 మాదిరిగానే ఉంటుంది. కొత్త బజాజ్ పల్సర్ ఎన్150 ఒక లీటర్ ఇంధనాన్ని ఉపయోగించి దాదాపు 45 నుండి 50 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. బరువు గురించి చెప్పాలంటే, కొత్త బజాజ్ పల్సర్ పల్సర్ N160 కంటే 7 కిలోలు తేలికగా ఉంటుంది.
ఫీచర్లు: సస్పెన్షన్ డ్యూటీ గురించి మాట్లాడుకుంటే, బజాజ్ పల్సర్ N150 సౌకర్యవంతమైన రైడ్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ వెనుక మోనో-షాక్ సస్పెన్షన్ ఇవ్వబడింది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే, బైక్‌ను కంట్రోల్ చేయడానికి, ముందు భాగంలో 240 mm డిస్క్ వెనుక 130 mm డ్రమ్ ఉన్నాయి. నియంత్రణలో సహాయపడటానికి సింగిల్-ఛానల్ ABS కూడా అందుబాటులో ఉంది.