మార్చిలో వరుసగా 6 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు ....?

Ashok Kumar   | Asianet News
Published : Feb 22, 2020, 11:04 AM ISTUpdated : Feb 22, 2020, 11:08 AM IST
మార్చిలో వరుసగా 6 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు ....?

సారాంశం

 వరసగా 6 రోజులు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.ఒక్క మార్చి నెల రెండో వారంలో బ్యాంకులు కేవలం ఒకే రోజు మార్చి 9న మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 

వచ్చే నెల మార్చిలో బ్యాంకు ఉద్యోగుల స్ట్రయిక్ కారణంగా వరసగా 6 రోజులు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.ఒక్క మార్చి నెల రెండో వారంలో బ్యాంకులు కేవలం ఒకే రోజు మార్చి 9న మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.

దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే వేతనాలు పెంపును కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజుల దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.

also read త్వరలో టెలికాం చార్జీలకు రెక్కలు! 25% పెంపు పక్కా?!

మార్చి 10 వ తేదీన హోలీ కావడంతో ఆ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక మార్చి 11 నుంచి 13 వరకు స్ట్రయిక్ చేస్తే మళ్ళీ 14న రెండవ శనివారం, మార్చి 15 ఆదివారం కావడంతో బ్యాంకులకు యధావిదిగా హాలి డేస్ ఉంటాయి.

దీంతో వరుసగా 6 రోజులపాటు బ్యాంకుల సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.  ఈ ప్రభావంతో మార్చి రెండో వారంలో కేవలం 9వ తేదీన మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. కాగా 20 శాతం వేతనాలు పెంచాలని ఎంప్లాయిస్ యూనియన్లు డిమాండ్ చేస్తుంటే, 12. 5 శాతం పెంచేందుకు బ్యాంకు యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి.

also read కరోనా ఎఫెక్ట్: టీవీ,ఫ్రిజ్‌, ఏయిర్ కండిషనర్ల ధరలు ఇంకా పైపైకి

దీనిపై కేంద్ర లేబర్ కమిషనర్ వద్ద మరోసారి చర్చలు జరగునున్నాయి. మార్చి నెలలో మొత్తం 4 వారాలలో ఒక వారం మొత్తం బ్యాంకు కార్యకలాపాలు ఆటంకమ కలిగే అవకాశం ఉన్నందున కస్టమర్లు కాస్త తమ బ్యాంకు పనుల విషయం లో జాగ్రత్త పడాలి.

ఇప్పటిలాగే మిగినలీన మూడు వరలలో అదివారాలు, నాలుగో శనివారం కూడా సెలవు ఉంటుంది. ఇంకా ఉగాది పండుగ కూడా మార్చి నెలలో ఉండటం వల్ల మరొక రోజు కూడా హాలీడే ఉంటుంది. మొత్తం మార్చి నెలలో సెలవులు, స్ట్రైక్ , పండుగ హాలిడేస్ తో కలిగి మొత్తం పది రోజులు బ్యాంకు కార్యాలయాలకు ఆటంకమ ఉండొచ్చు.

PREV
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే