బాలీవుడ్ సినిమాపై ట్రంప్ కామెంట్...సోషల్ మీడియాలో వైరల్....

By Sandra Ashok KumarFirst Published Feb 22, 2020, 12:25 PM IST
Highlights

శుక్రవారం శివ రాత్రి రోజున "శుబ్ మంగల్ జ్యదా సావ్ధాన్" చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా మరొక వ్యక్తితో కలిసి ఉండటానికి సామాజిక నిరాకరణకు గురైన యువకుడి పాత్రలో నటించారు.

వాషింగ్టన్: బాలీవుడ్‌లో కొత్తగా విడుదలైన గే రొమాన్స్-కామెడీ మూవీకి ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమా పై ఒక వ్యక్తి  సోషల్ మీడియా ట్విటర్ లో ఒక పోస్ట్ చేశారు. దానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రతి స్పందనగా  రిప్లై కూడా ఇచ్చారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ముందు శుక్రవారం విడుదలైన బాలీవుడ్‌ సినిమాపై  ట్విటర్ లో చేసిన ఒక ట్వీట్ కి రిప్లై చేశారు. స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త పీటర్ టాట్చెల్  బాలీవుడ్‌ సినిమా "శుబ్ మంగల్ జ్యదా సావ్ధాన్" చిత్రానికి మద్దతుగా ట్విటర్ లో ట్వీట్ చేశారు. తన ట్వీట్ కి  అమెరికా అధ్యక్షుడు  'గ్రేట' అని రీట్వీట్ చేశారు.

also read మార్చిలో వరుసగా 6 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు ....?

శుక్రవారం విడుదలైన "శుబ్ మంగల్ జ్యదా సావ్ధాన్" సినిమాలో నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా  ముఖ్య  పాత్రలో నటించాడు. ఈ సినిమాలో తాను మరొక వ్యక్తితో కలిసి ఉండటానికి సామాజిక నిరాకరణకు గురైన ఒక యువకుడి పాత్రలో నటించారు.

హితేష్ కేవల్య  ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. స్వలింగ సంపర్కం అనే మెయిన్ కాన్సెప్ట్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. త‌మ సినిమాపై ట్రంప్ స్పందించ‌డంపై చిత్ర బృందం ఆనందం వ్య‌క్తం చేస్తుంది. 

also read త్వరలో టెలికాం చార్జీలకు రెక్కలు! 25% పెంపు పక్కా?!

ట్రంప్ రిట్వీట్ కి "ఎల్‌జిబిటి + హక్కులను వాస్తవంగా స్వీకరించడానికి ఇది ఒక ప్రారంభమని నేను నమ్ముతున్నాను & ఇది పిఆర్  కోసం చేసిన స్టంట్ కాదు" అని మిస్టర్ టాట్చెల్ తరువాత ట్వీట్ చేశారు.2018 లో స్వలింగ సంపర్కంపై నిషేధాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.

అమెరికా ప్రథమ మహిళ మెలానియాతో కలిసి డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటించనున్నారు. ఈ నెల 24న సోమవారం గుజరాత్ అహ్మదాబాద్ లో ట్రంప్ అడుగుపెట్టనున్నారు. తరువాత రోజు న్యూ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరపనున్నారు.

click me!