కస్టమర్ల ఆరోగ్యం కోసం డొమినోస్ పిజ్జా కొత్త సర్వీస్...

By Sandra Ashok KumarFirst Published Mar 21, 2020, 11:37 AM IST
Highlights

ఈ సర్వీస్ పొందడానికి కస్టమర్లు ఆర్డర్ ఇచ్చేటప్పుడు 'జీరో కాంటాక్ట్ డెలివరీ' ఆప్షన్ ఎంచుకోవాలి. డొమినో  యాప్ లేటెస్ట్ వెర్షన్ నుండి డిజిటల్‌గా పేమెంట్  చేయాలి.

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా డొమినోస్ పిజ్జా తన 1,325 రెస్టారెంట్లలో 'జీరో కాంటాక్ట్ డెలివరీ' ను ప్రవేశపెట్టింది.కొత్త డెలివరీ పద్దతి ద్వారా డొమినోస్ కస్టమర్లకు డెలివరీ సిబ్బందితో సంబంధం లేకుండా ఆర్డర్‌ను స్వీకరిస్తుంది.

డొమినో యాప్ తాజా వెర్షన్‌లో "జీరో కాంటాక్ట్ డెలివరీ" సేవ అందుబాటులో వచ్చేసింది. ఈ సర్వీస్ పొందడానికి వినియోగదారులు ఆర్డర్ ఇచ్చేటప్పుడు "జీరో కాంటాక్ట్ డెలివరీ" ఆప్షన్ ఎంచుకోవాలి. డొమినో యాప్ కొత్త వెర్షన్ నుండి డిజిటల్‌ పేమెంట్ చెల్లించాలి.

also read నాలుగు రోజుల్లో రిలయన్స్ రూ.1.20 లక్షల కోట్లు గోవిందా

మేము జీరో కాంటాక్ట్ డెలివరీని ప్రారంభించాము. కస్టమర్లు డొమినో యాప్ ద్వారా ఆన్‌లైన్ ఆర్డర్‌ను ఇవ్వవచ్చు, జీరో కాంటాక్ట్ డెలివరీ ఆప్షన్ తో డిజిటల్‌గా పేమెంట్ చెల్లించవచ్చు. అప్పుడు మేము మా కస్టమర్లతో ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా డొమినోస్ పిజ్జాలను కస్టమర్లకు అందిస్తుంది.

కస్టమర్, ఉద్యోగుల భద్రత మా ముఖ్య  ప్రాధాన్యత అని, మేము దాని కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాము అని జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & హోల్ టైమ్ డైరెక్టర్ ప్రతీక్ పోటా.

భారతదేశంలోని డొమినోస్ పిజ్జాకు లైసెన్స్ పొందిన జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ (జెఎఫ్ఎల్) కూడా డెలివరీ కోసం తమ అన్ని స్టోర్లలో ఎక్కువ పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రోటోకాల్‌లను పాటిస్తుందని తెలిపారు.

also read కరోనా కాటు: ఏవియేషన్‌పై పోటు.. వేతనాలపై వేటు

"డెలివరీ సిబ్బంది, కంపెనీ ఉద్యోగులకు ఆరోగ్య పరీక్ష చేసిన తర్వాత వారిని జీరో కాంటాక్ట్ డెలివరీ కోసం నియమించాము" అని డైరెక్టర్ ప్రతీక్ పోటా తెలిపారు. సేఫ్ డెలివరీ ఎక్స్ పర్ట్ ఆర్డర్‌తో వచ్చాక, అతను తిరిగి వెళ్ళే ముందు కస్టమర్  డోర్ ముందు క్యారీ బ్యాగ్‌లో  ఆర్డర్ పెట్టేసి వెళ్తాడు.

పిజ్జా సంస్థ తన రెస్టారెంట్లు, డెలివరీ బైక్‌లు, డెలివరీ బైక్ బాక్స్‌లు, పిజ్జా డెలివరీ హాట్ బ్యాగ్‌లను ప్రతి నాలుగు గంటలకు ఒకసారి శుభ్రపరుస్తున్నట్లు పేర్కొంది.

245 డిగ్రీల సెల్సియస్ వేడి చేసిన పిజ్జాలన్నీ వినియోగానికి సురక్షితమని కంపెనీ పేర్కొంది.డొమినోస్ మాత్రమే కాదు, ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్డొనాల్డ్స్ కూడా దేశంలో "జీరో కాంటాక్ట్ డెలివరీ" ను ప్రారంభించింది.

click me!