Latest Videos

నోటుపై గీతలు ఎందుకు ఉంటాయి? వాటి అర్థం తెలుసా?

By Ashok KumarFirst Published Jun 27, 2024, 8:56 AM IST
Highlights

కరెన్సీ నోట్ల అంచులపై కాస్త వంగి ఉన్న గీతలు ఉంటాయి. అవి ఎందుకు అలా ఉంటాయో తెలుసా..? కరెన్సీ నోటు అంచున ముద్రించిన ఈ వంగి ఉన్న గీతలను బ్లీడ్ మార్కులు అంటారు.

డబ్బు లేకుండా ఏ పనీ సాధ్యం కాదు. ప్రతిరోజూ ఏం చేయాలన్నా మనం డబ్బు ఖర్చు చేయకుండా జీవించలేము. ఇక అదే  కరెన్సీ నోట్ల విషయానికొస్తే, భద్రత కోసం నోట్లపై కొన్ని చిహ్నాలు ఉంటాయి. అలా ప్రింట్ చేస్తారంటే...

ప్రత్యేకించి, కరెన్సీ నోట్ల అంచులపై కాస్త వంగి ఉన్న గీతలు ఉంటాయి. అవి ఎందుకని కారణం కొందరికి మాత్రమే తెలిసి ఉండవచ్చు ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు. కరెన్సీ నోటు అంచున ముద్రించిన ఈ వంగి ఉన్న గీతలను బ్లీడ్ మార్కులు అంటారు.


ఇది ఆ కరెన్సీ నోటు విలువ ప్రకారం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఏ నోటు ఎంత నోటు అనేది అంధులు (కళ్ళు లేని వారు) తెలుసుకునేందుకు వీలుగా ఈ లైన్లను ముద్రించారు. 

ఈ వంగి ఉన్న గీతల సహాయంతో అంధులు ఏ నోటునైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అంధులు వారి వేళ్లతో రుద్దడం ద్వారా నోటు విలువను తెలుసుకోవచ్చు. 

ప్రతి నోటు విలువను బట్టి వంగి ఉన్న  గీతాలు ప్రింట్ చేసి ఉంటాయి. ఉదాహరణకు 100 రూపాయల నోటు తీసుకుంటే.. దానికి రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి. 200 రూపాయల నోట్లకు కూడా 4 లైన్లు ఉంటాయి. కానీ దానికి రెండు సున్నాలు జోడించి ఉంటాయి. 

అదే విధంగా 500 రూపాయల నోట్లపై 5 లైన్లు, 2000 రూపాయల నోట్లపై 7 లైన్లు ముద్రించారు. అంధులు ఈ లైన్లను టచ్ చేయడం ద్వారా నోటు విలువ ఎంతో అర్థం చేసుకోవచ్చు. 

click me!