జాతీయ, రాష్ట్ర హాలిడేస్, ప్రభుత్వ ప్రకటనలు ఇతర బ్యాంకులతో సమన్వయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్ విడుదల చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెల జూలైకి సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్ విడుదల చేసింది. వీటిలో ప్రాంతీయ హాలిడేస్, వీకెండ్ హాలిడేస్ కూడా ఉన్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ప్రతి ఏడాదికి ఒకసారి ఈ బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది.
ఇందులో భాగంగా జులైలో 12 రోజుల పాటు బ్యాంకు హాలిడేస్ రానున్నాయి. జాతీయ, రాష్ట్ర హాలిడేస్, ప్రభుత్వ ప్రకటనలు ఇతర బ్యాంకులతో సమన్వయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్ విడుదల చేసింది.
జూలైలో బ్యాంకు హాలిడేస్
జూలై 03: మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఉన్న బ్యాంకులు జూలై 3, 2024న బెహ్ దీంఖలామ్(Behdienkhlam Festival) కారణంగా మూసివేసి ఉంటాయి.
జూలై 06: MHIP డే కారణంగా ఈ రోజు ఐజ్వాల్‌లో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.
జూలై 07: ఆదివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులు బంద్.
జూలై 08: జూలై 8న కాంగ్ రథజాత్ర సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులు బంద్.
జూలై 09: Drukpa Tshe-zi ని చూడటానికి గాంగ్‌టక్‌లోని బ్యాంకులు మూసివేయనుంది.
జూలై 13: రెండో శనివారం కావడంతో అన్ని బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.
జూలై 14: ఆదివారం కావడంతో అన్ని బ్యాంకులకు వీకెండ్ హాలిడే.
జూలై 16: హరేలా పండగ కారణంగా డెహ్రాడూన్‌లోని బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.
జూలై 17: ముహర్రం సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.
జూలై 21: ఆదివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులు బంద్.
జూలై 27: నాలుగో శనివారం కావడంతో అన్ని బ్యాంకులు కూడా ఈ రోజు బంద్.
జూలై 28: ఈ రోజు జూలై చివరి ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.