కరోనా కారణంగా డిస్నీ సంచలన నిర్ణయం.. అందుకే కొన్ని కార్యక్రమాలను కూడా నిలిపివేశాం..

By Sandra Ashok KumarFirst Published Sep 30, 2020, 12:07 PM IST
Highlights

ఒకవైపు లాక్ డౌన్ మరో వైపు ఖర్చులను తగ్గించుకోవటానికి ఉద్యోగాల కోతలు విషయం తెలిసిందే. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలలోని డిస్నీ ఉద్యోగాల కోతపై సంచలన నిర్ణయం తీసుకుంది. డిస్నీ లో పనిచేస్తున్న  28,000 థీమ్ పార్క్ ఉద్యోగాలను అంటే 25 శాతం రిసార్ట్స్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక రంగాన్ని తీవ్రమైన దెబ్బ తీసింది. ఒకవైపు లాక్ డౌన్ మరో వైపు ఖర్చులను తగ్గించుకోవటానికి ఉద్యోగాల కోతలు విషయం తెలిసిందే. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలలోని డిస్నీ ఉద్యోగాల కోతపై సంచలన నిర్ణయం తీసుకుంది.

డిస్నీ లో పనిచేస్తున్న  28,000 థీమ్ పార్క్ ఉద్యోగాలను అంటే 25 శాతం రిసార్ట్స్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు  మంగళవారం డిస్నీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

"ఈ నిర్ణయం తీసుకోవటం చాలా హృదయ విదారకంగా ఉంది. గత కొన్ని నెలలుగా ఉద్యోగాల కోత లేకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్ ఎంతో కృషి చేసింది. ఇందుకోసం ఖర్చులు తగ్గించుకోవటం, కొన్ని కార్యక్రమాలను కూడా నిలిపివేశాం.

also read ముఖేష్ అంబానీ సంపాదన ఒక్క గంటకు ఎంతో తెలుసా..? ...

డిస్నీ లాభాలను దృష్టిలో పెట్టుకొని  ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు. ఇందులో 67 శాతం మంది పార్ట్‌టైమ్ ఉద్యోగులు ఉన్నారు. తొలగించిన వారిలో ఎగ్జిక్యూటివ్స్, వర్కర్స్  ఉన్నారు. డిస్నీల్యాండ్ కాంప్లెక్స్‌లోనే సుమారు 32,000 మంది పనిచేస్తున్నారు.

  ఫ్లోరిడా, పారిస్, షాంఘై, జపాన్ హాంకాంగ్‌లోని డిస్నీ థీమ్ పార్కులు లాక్ డౌన్ తరువాత ఓపెన్ చేసినా కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయన తెలిపారు.

కాలిఫోర్నియా, ఫ్లోరిడాలలోని డిస్నీ థీమ్ పార్కుల్లో ఉద్యోగుల తొలగింపు అనంతరం ఉద్యోగుల సంఖ్య 1,10,000 నుంచి 82,000లకు తగ్గుతుందన్నారు. కోవిడ్-19 ప్రభావం తమ వ్యాపారంపై పడటంతో ఉన్న ఉద్యోగుల్లో నాల్గవ వంతు 28 వేల మందిని తొలగిస్తున్నామని" డిస్నీ పార్కు ఛైర్మన్ జోష్ డి అమారో తెలిపారు. 

click me!