NSE Co-Location Scam: కో-లొకేషన్ కుంభకోణంలో చిత్రా రామకృష్ణకు 7 రోజుల సీబీఐ క‌స్ట‌డీ..

Published : Mar 07, 2022, 10:50 PM IST
NSE Co-Location Scam: కో-లొకేషన్ కుంభకోణంలో చిత్రా రామకృష్ణకు 7 రోజుల సీబీఐ క‌స్ట‌డీ..

సారాంశం

NSE Co-Location Scam కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను (Chitra Ramkrishna) ఢిల్లీ కోర్టు సోమవారం 7 రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపింది. సీబీఐ కోర్టు ఆనంద్ సుబ్రమణ్యం కస్టడీని మార్చి 9 వరకు పొడిగించింది. 

కో-లొకేషన్ కుంభకోణం (NSE Co-Location Scam)కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను (Chitra Ramkrishna) ఢిల్లీ కోర్టు సోమవారం ఏడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. ఆదివారం రాత్రి అరెస్టయిన చిత్రా రామకృష్ణను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. అంతకుముందు, గత నెలలో, మాజీ NSE గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణ్యం అరెస్టయ్యారు. ఎన్‌ఎస్‌ఈ కేసులో చెన్నైలో సీబీఐ అతడిని అరెస్టు చేసింది. ఇద్దరూ సంస్థలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు తలెత్తాయి.

సీబీఐ కోర్టు ఆనంద్ సుబ్రమణ్యం కస్టడీని మార్చి 9 వరకు పొడిగించింది. ఎన్‌ఎస్‌ఈ కేసులో చెన్నై నుంచి సీబీఐ అతడిని అరెస్టు చేసింది. ఈ 2 అరెస్టుల తర్వాత ఈ కేసులో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కోర్టులో సీబీఐ ఏం చెప్పింది
వివిధ నిందితుల మధ్య పంపిన 2,500 ఇమెయిల్‌లను స్వాధీనం చేసుకున్నామని, దానితో పాటు 14 రోజుల కస్టడీని కోర్టు ముందుంచామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఆనంద్ సుబ్రమణ్యంతో, రామకృష్ణకు ముఖాముఖి పరిచయం ఉందని, అయితే చిత్రా రామకృష్ణ ఆయనను గుర్తించేందుకు నిరాకరించారని సీబీఐ పేర్కొంది. చిత్రా రామకృష్ణను విచారించేందుకు సీనియర్ సైకాలజిస్ట్ సహాయం తీసుకున్నట్లు కూడా సీబీఐ కోర్టుకు తెలిపింది. చిత్రా రామకృష్ణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో జాప్యం చేస్తున్నారని సైకాలజిస్ట్ కూడా తేల్చారని, అందుకే సిబిఐ అరెస్టు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. గతంలో చిత్రా రామకృష్ణను సీబీఐ వరుసగా మూడు రోజుల పాటు ప్రశ్నించింది.

చిత్ర 2013లో ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు
చిత్రా రామకృష్ణ ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఆమె  1985 సంవత్సరంలో IDBI బ్యాంక్‌ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించాడు. కొంత కాలం సెబీలో కూడా పనిచేశారు. 1991లో NSE ప్రారంభమైనప్పటి నుండి ఆమె ప్రధాన పాత్రలో ఉంది. 'హర్షద్ మెహతా స్కామ్' తర్వాత పారదర్శక స్టాక్ ఎక్స్ఛేంజీని సృష్టించేందుకు ఎంపికైన మొదటి NSE CEO RH పాటిల్ నేతృత్వంలోని 5 మంది వ్యక్తులలో చిత్ర కూడా ఉన్నారు. 2013లో రవి నారాయణ్ పదవీకాలం ముగిసిన తర్వాత, చిత్ర 5 సంవత్సరాల పాటు NSE చీఫ్‌గా నియమితులయ్యారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?