Titan Company: రాకేష్ జున్ జున్ వాలాకు అత్యంత ప్రియమైన స్టాక్ తక్కువ ధరకే లభిస్తోంది..మీరు ఓ లుక్కేయండి...

Published : Mar 07, 2022, 09:35 PM IST
Titan Company: రాకేష్ జున్ జున్ వాలాకు అత్యంత ప్రియమైన స్టాక్ తక్కువ ధరకే లభిస్తోంది..మీరు ఓ లుక్కేయండి...

సారాంశం

రాకేష్ జున్ జున్ వాలాకు అత్యంత ప్రియమైన స్టాక్ Titan Company ఈ స్టాక్ లో దాదాపు ఆయన 5.1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. అయితే ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ స్టాక్ కరెక్షన్ మోడ్ లో ఉంది. అయితే ప్రస్తుతం ఈ స్టాక్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

టాటా గ్రూపునకు చెందిన దిగ్గజ స్టాక్ టైటాన్ కంపెనీ (Titan Company) షేర్లలో ఒత్తిడి కనిపిస్తోంది. ఈరోజు ఇంట్రాడేలో ఈ స్టాక్ 4.5 శాతానికి పైగా పడిపోయి రూ. 2330కి చేరుకుంది. కాగా శుక్రవారం రూ.2441 వద్ద ముగిసింది. అయితే కోలుకుని రూ.2400ల వద్ద ట్రేడవుతోంది. నేటి కనిష్ట స్థాయి ప్రకారం, స్టాక్ దాని రికార్డు గరిష్ట స్థాయి నుండి పతనం అవుతోంది. నిపుణులు, బ్రోకరేజీ సంస్థలు ఇదే సరైన పెట్టుబడి అవకాశంగా భావిస్తున్నాయి. 

ఇటీవలి మార్కెట్ కరెక్షన్ తర్వాత స్టాక్ వాల్యుయేషన్ ఆకర్షణీయంగా మారిందని నిపుణులు పేర్కొన్నారు. అదే సమయంలో, ప్రస్తుత బంగారం ధరల పెరుగుదల కంపెనీ వ్యాపారానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల, ఇన్వెస్టర్లు ప్రస్తుత ధర వద్ద ఈ స్టాక్ లో కొంత మేర పెట్టుబడి పెట్టుకోవచ్చని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా టైటాన్ కంపెనీ (Titan Company) రాకేష్ జున్‌జున్‌వాలాకు తన పోర్ట్ ఫోలియోలు అమితంగా ఇష్టపడే స్టాక్ ఇదే కావడం విశేషం. 

రికార్డు స్థాయి నుంచి 13 శాతం తగ్గుదల
టైటాన్ కంపెనీ (Titan Company) ఈ ఏడాది జనవరి 7న రూ.2687 ధరను తాకింది. ఈ స్టాక్‌కు ఆల్ టైమ్ రికార్డు గరిష్ట స్థాయి ఇదే కావడం విశేషం. ఈ రోజు ఇంట్రాడేలో రూ.2330కి చేరింది. ఈ కోణంలో స్టాక్ గరిష్టంగా 13 శాతం మేర, రూ. 357 బలహీనపడింది. ప్రస్తుతం మార్కెట్ పతనం కారణంగా కంపెనీ షేరు బలహీనపడింది. అయితే ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు ఈ స్టాక్ పెట్టుబడిదారులకు దాదాపు 66 శాతం రాబడిని అందించింది. 

ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి...
IIFL రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ, టైటాన్ కంపెనీ (Titan Company) విషయానికి వస్తే, దాని ఔట్‌లుక్ మెరుగ్గా ఉంది. స్టాక్‌లో ఫండమెంటల్స్ బలంగా కనిపిస్తున్నప్పటికీ, మార్కెట్ కరెక్షన్ లో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ప్రస్తుతం స్వల్పకాలిక ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జించేందుకు ఈ పతనం సరైన అవకాశం. దాదాపు రూ. 2350-2360 స్టాక్‌లోకి ప్రవేశించడం మంచిదని అనూజ్ గుప్తా పేర్కొన్నారు. రాబోయే నెల రోజులకు గానూ రూ. 2550 టార్గెట్ తో, రూ. 2200 స్టాప్ లాస్‌ వద్ద ఉంచుకోమని సలహా అందించారు. 

దీర్ఘకాలంలో టైటాన్ స్టాక్ (Titan Stock) 3300 దాటనుంది...
గ్లోబల్ బ్రోకరేజ్ హౌస్ మాక్వారీ కూడా Titan Company Ltd స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. బ్రోకరేజ్ స్టాక్‌కు అవుట్‌పెర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చింది.  రూ.3350 టార్గెట్ ఇచ్చింది. ఈరోజు ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.2330ని పరిశీలిస్తే, అది 43 నుంచి 44 శాతం రాబడిని ఇవ్వగలదని అంచనా వేసింది. కంపెనీ తమ వ్యాపారాల్లో మార్కెట్ వాటాను నిరంతరం పెంచుతోందని, ఇది మరింత ప్రయోజనం పొందుతుందని బ్రోకరేజ్ హౌస్ చెబుతోంది. డిమాండ్ బలం కారణంగా ఆదాయాల ఔట్ లుక్  కూడా బలంగా ఉంది. అదే సమయంలో, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం, సహా విలువైన లోహాల ధరలను పెంచడం వల్ల కంపెనీ ప్రయోజనం పొందుతోంది. 

రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో టైటాన్ కంపెనీ (Titan Company Ltd)లో షేర్లు  చాలా కాలంగా ఉన్నాయి. కంపెనీలో ఆయనకు దాదాపు 5.1 శాతం వాటా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీలో 0.2 శాతం వాటాను పెంచుకున్నారు. అతని పోర్ట్‌ఫోలియోలో కంపెనీకి చెందిన మొత్తం 45,250,970 షేర్లు ఉన్నాయి. దీని ప్రస్తుత విలువ రూ. 10,885.6 కోట్లుగా ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?