పడిపోతున్న క్రూడాయిల్.. నేడు పెట్రోల్- డీజిల్ కొత్త ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Sep 26, 2022, 8:34 AM IST
Highlights

మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి రాష్ట్రంలో వ్యాట్ తగ్గించడం ద్వారా పెట్రోల్ పై ప్రజలకు ఉపశమనం లభించింది. మరోవైపు, మేఘాలయలో పెట్రోల్ - డీజిల్ ధర లీటరుకు ఒకటిన్నర రూపాయల వరకు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గుల మధ్య సోమవారం పెట్రోలు-డీజిల్ ధరలు అప్ డేట్ చేయబడ్డాయి. నేటికీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో గత నాలుగు నెలలకు పైగా పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

మరోవైపు గత మూడు నెలలుగా క్రూడాయిల్ ధరలలో తగ్గుదల కొనసాగుతోంది. మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి రాష్ట్రంలో వ్యాట్ తగ్గించడం ద్వారా పెట్రోల్ పై ప్రజలకు ఉపశమనం లభించింది. మరోవైపు, మేఘాలయలో పెట్రోల్ - డీజిల్ ధర లీటరుకు ఒకటిన్నర రూపాయల వరకు పెరిగింది.

ఎక్సైజ్ సుంకం తగ్గింపు
పెట్రోలు డీజిల్ ధరల పై ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.5 తగ్గాయి. 

క్రూడాయిల్ రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇదిలా ఉంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత తగ్గుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే చమురు కంపెనీల వైపు నుంచి ధరలో ఎలాంటి తగ్గింపు లేదు. ముడిచమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 79.64 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 87.07 వద్ద కనిపించింది.

ప్టెంబర్ 26న పెట్రోలు-డీజిల్ ధరలు
- పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ ధర రూ. 84.10, డీజిల్ ధర రూ. 79.74
- ఢిల్లీ పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62 
-ముంబైలో  పెట్రోల్ ధర రూ. 111.35, డీజిల్ ధర  రూ.97.28
- చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.102.63, డీజిల్‌ ధర రూ.94.24
-కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.106.03, డీజిల్‌ ధర రూ.92.76
-నోయిడాలో పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్‌ ధర రూ.89.96
 - తిరువనంతపురంలో పెట్రోల్ ధర రూ. 107.71, డీజిల్ ధర లీటరుకు రూ. 96.52
 - పాట్నాలో పెట్రోల్ ధర రూ. 107.24, డీజిల్ ధర లీటరుకు రూ. 94.04
- గురుగ్రామ్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ.97.18, డీజిల్‌ ధర రూ.90.05
 - బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.101.94, డీజిల్‌ ధర రూ.87.89
-భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్‌ ధర రూ.94.76
-హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

ప్రతి రోజు ఉదయం
 ప్రతిరోజూ పెట్రోల్ - డీజిల్ ధరలలో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇంకా ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

ఈ విధంగా మీరు నేటి ధరలను
మీరు SMS ద్వారా కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు, HPCL కస్టమర్లు HPPrice అండ్ వారి సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

click me!