Nothing Phone: రెండు ఫోన్లు.. సూపర్ ఫీచర్లు.. నథింగ్ ఫోన్ 3a సిరీస్ విడుదలకు సిద్ధం

Published : Mar 03, 2025, 05:35 PM IST
Nothing Phone: రెండు ఫోన్లు..  సూపర్ ఫీచర్లు.. నథింగ్ ఫోన్ 3a సిరీస్ విడుదలకు సిద్ధం

సారాంశం

Nothing Phone 3a Series: నథింగ్ ఫోన్ 3a సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 3a, 3a ప్రో పేర్లతో రిలీజ్ అవుతున్న ఈ ఫోన్లు సూపర్ ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. వీటి స్పెషల్ ఫీచర్స్ తెలిస్తే మీకు కచ్చితంగా ఈ పాత ఫోన్ మార్చి ఇవి కొనాలనుకుంటారు. అవేంటో చూద్దాం రండి. 

నథింగ్ ఫోన్ 3a సిరీస్ మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది నథింగ్ ఫోన్ 2a కంటే చాలా మెరుగైన ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోంది. నథింగ్ ఫోన్ 3a, కొత్త నథింగ్ ఫోన్ 3a ప్రో మోడల్స్‌ను కంపెనీ రిలీజ్ చేస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో కెమెరా, ఐఫోన్ తరహా యాక్షన్ బటన్ ఉంటుందన్న విషయం ఇప్పటికే లీక్ అయ్యింది. నథింగ్ ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో వివరాలు, ఫీచర్లు, కెమెరాలు, స్పెసిఫికేషన్లు, ధర గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a Pro

నథింగ్ ఫోన్ 3a చూడటానికి పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లా ఉంటుంది. దీని వెనుక భాగం ట్రాన్స్‌పరెన్సీగా, టాబ్లెట్ ఆకారంలో కెమెరా ఉండటమే దీనికి కారణం. నథింగ్ ఫోన్ 3a ప్రోలో పెద్ద కెమెరా ఉంది. ఇది వెనుకవైపు ఉంటుంది. రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఉంది.

నథింగ్ ఫోన్ 3a, 3a ప్రోలో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంటుందని సమచారం. రెండు డివైజ్‌లలో స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్ ఉండొచ్చు. ఇందులో 256 GB స్టోరేజ్, 12 GB వరకు ర్యామ్ ఉంటుంది.

బ్యాటరీల విషయానికొస్తే రెండు డివైజ్‌లలో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో మూడు కెమెరాలు ఉంటాయి. వాటిలో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ప్రో మోడల్‌లో 3x ఆప్టికల్ జూమ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఫోన్ 3aలో 2x ఆప్టికల్ జూమ్ ఉంటుంది.

నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a Pro ధర ఎంత?

నథింగ్ ఫోన్ 3a ప్రో ధర సుమారు రూ.32,000, నథింగ్ ఫోన్ 3a ధర సుమారు రూ.27,000 ఉండొచ్చు. కంపెనీ ఇంకా కచ్చితమైన ధరను చెప్పలేదు.

 

PREV
click me!

Recommended Stories

Today Gold Rate: అక్షయ తృతీయ ఎఫెక్ట్ ..పెరుగుతున్న బంగారం ధరలు..ఇప్పుడు ఎంతుందో తెలుసా?
Today Gold Rate: మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం..గ్రాము ఎంత పెరిగిందో తెలుసా?