చైనాలో 1 రోజులో అత్యంత సంపన్నుడిగా మారిన వాటర్- బాటిల్ వ్యాపారవేత్త..

By Sandra Ashok KumarFirst Published Sep 24, 2020, 6:18 PM IST
Highlights

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ షాన్షాన్ అనే వ్యక్తి నికర విలువ బుధవారం 58.7 బిలియన్లకు చేరుకుంది, ఇది చైనా సంపన్నుడు జాక్ మా కంటే 2 బిలియన్ డాలర్లు ఎక్కువ.

ఒక వాటర్- బాటిల్  వ్యాపారవేత్త జాంగ్ షాన్‌షాన్‌ ఒక్క రోజులో చైనా దేశ అత్యంత  సంపన్నుడిగా మారారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ షాన్షాన్ అనే వ్యక్తి నికర విలువ బుధవారం 58.7 బిలియన్లకు చేరుకుంది,

ఇది చైనా సంపన్నుడు జాక్ మా కంటే 2 బిలియన్ డాలర్లు ఎక్కువ. జాంగ్ షాన్‌షాన్‌ ఇప్పుడు ఆసియాలో రెండవ ధనవంతుడు, భారతదేశంలోని ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు.

also read అప్పుడు కూడా వర్క్ ఫ్రోం హోం కల్చర్ కొనసాగించోచ్చు.. : బిల్ గేట్స్ ...

ప్ర‌పంచ కుబేరుల‌తో కూడిన 500 మంది జాబితాలో జాంగ్ షాన్‌షాన్‌ 17వ ర్యాంక్‌లో ఉన్నారు. జాంగ్ షాన్‌షాన్‌ సంపద 2020లో దాదాపు 52 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

బుధవారం టెక్ స్టాక్స్ తడబడటం, టెస్లా "బ్యాటరీ డే" ఈవెంట్ అంచనాలకు తగ్గడంతో ఎలాన్ మస్క్ సంపద దాదాపు  10 బిలియన్లు పడిపోయింది. జాంగ్ షాన్‌షాన్‌ ఇప్పుడు చైనాలోని సంపన్నుల ర్యాంకింగ్‌లో ఆధిపత్యం వహిస్తున్నాడు.

అంతే కాదు జాంగ్ షాన్ షాన్ కంపెనీ ఓ టీకా త‌యారీ సంస్థ‌లో వాటా కూడా కొన్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. అతనికి ఒంట‌రి తోడేలు అనే పేరు కూడా ఉన్న‌ది.
 

click me!