పబ్-జి గేమ్ నిషేధం పై ప్రస్తుతం అలాంటి ఆలోచనలు లేవు: మినిస్ట్రీ శాఖ

By Sandra Ashok KumarFirst Published Sep 24, 2020, 3:41 PM IST
Highlights

గాల్వాన్ లోయలో భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణల కారణంగా భారత ప్రభుత్వం కొన్ని నెలల క్రితం చైనా యజమాన్యంలోని 59 యాప్స్ పై నిషేధం విధించింది. ఇందులో ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కూడా ఉంది. 

గత కొద్ది రోజులక్రితం అత్యంత పాపులర్ గేమ్ పబ్-జి పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గాల్వాన్ లోయలో భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణల కారణంగా భారత ప్రభుత్వం కొన్ని నెలల క్రితం చైనా యజమాన్యంలోని 59 యాప్స్ పై నిషేధం విధించింది.

ఇందులో ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కూడా ఉంది. ఈ నిషేధం తరువాత కొద్ది రోజులకి  పబ్-జి గేమ్ పై నిషేధం విధించింది. అతి తక్కువ సమయంలోనే ఇండియాలో పబ్-జి అత్యంత పాపులర్ గేమ్ గా అవతరించింది.

also read  

అయితే తాజాగా పబ్-జి గేమ్ పై వస్తున్న వార్తలకు  మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి వివరణ ఇస్తూ  పబ్-జి గేమ్ పై నిషేధం ఎత్తివేసే ప్రణాళికలు ఇప్పట్లో లేవని స్పష్టం చేసింది.

చైనా కంపెనీ అభివృద్ధి చేసిన ఈ గేమ్ ఆపిల్ స్టోర్, ప్లే స్టోర్ నుండి తొలగించింది. కాగా సెప్టెంబర్ 1నా పబ్-జి గేమ్ తో  సహ 117 చైనా అభివృద్ధి/ పబ్లిష్ చేసిన గేమ్స్ నిషేధించింది.

నిషేధం తొలగింపు పై ఎలాంటి చర్చలు లేవని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. పబ్-జి మొబైల్ గేమ్ కి సంబంధించిన సంస్థలు ఎవరూ నిషేధంపై చర్చించడానికి ముందుకు రాలేదని నివేదికలో పేర్కొంది.
 

click me!