చందా కొచ్చర్ రాజీనామా.. కొత్త సీఈవో ఎవరంటే..

By ramya neerukondaFirst Published Oct 4, 2018, 2:53 PM IST
Highlights

వీడియోకాన్‌ సంస్థకు రూ.3,250కోట్ల రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచ్చర్‌ సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 

ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో పదవికి చందా కొచ్చర్ రాజీనామా చేశారు. వీడియోకాన్‌ సంస్థకు రూ.3,250కోట్ల రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచ్చర్‌ సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె బ్యాంకు ఎండీ, సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఇందుకు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు కూడా అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా బీఎస్‌ఈకి తెలియజేశారు.

ఆమె స్థానంలో ఎండీ, సీఈవో పదవులకు వేరే వారిని ఎంపిక చేశారు. ఆమెపై ఆరోపణలు మొదలైన నాటి నుంచి చందా కొచ్చర్ విధులకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె స్థానంలో తాత్కాలిక సీఈవోగా సందీప్ బక్షి వ్యవహరించారు. కాగా.. ఇప్పుడు ఆయననే పూర్తి స్థాయి ఎండీ, సీఈవోగా నియమిస్తున్నట్లు ఐసీఐసీఐ బోర్డు ప్రకటించింది.

సందీప్‌ బక్షి అక్టోబరు 2, 2023 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. చందాకొచ్చర్‌ రాజీనామా ఆ బ్యాంకు షేర్లపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

click me!