‘పుష్కర’ రికార్డు: అత్యంత సంపన్నుడు ముకేశ్

By Arun Kumar PFirst Published Oct 4, 2018, 1:30 PM IST
Highlights

భారతదేశంలో అత్యంత సుసంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. వరుసగా పుష్కర కాలంగా 11వ ఏట కూడా దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డు నెలకొల్పారు. గతేడాదితో పోలిస్తే 9.3 బిలియన్ల డాలర్ల ఆదాయం పెరిగింది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. వరుసగా 11వ ఏట ఆయన నికర ఆదాయం 47.3 బిలియన్ల డాలర్లకు చేరుకున్నదని ఫోర్బెస్ మ్యాగజైన్ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ముకేశ్ అంబానీ ఆదాయం 9.3 బిలియన్ల డాలర్లకు పెరిగింది. దీనికి రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ టెల్కో సర్వీస్ విజయ గాధ కారణం అని ఫోర్బెస్ తెలిపింది. 

‘ఫోర్బెస్ ఇండియా రిచ్ లిస్ట్ 2018’ తెలిపిన జాబితా మేరకు భారతదేశ సంపన్నుల్లో విప్రో చైర్మన్ ఆజీం ప్రేమ్‌జీ రెండవస్థానానికి చేరుకున్నారు. గతేడాదితో పోలిస్తే అజీం ప్రేమ్ జీ ఆదాయం రెండు బిలియన్ల డాలర్లు పెరిగి 21 బిలియన్ల డాలర్లకు చేరింది. తదుపరి స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ సంస్థ అధినేత, సీఈఓ లక్ష్మీ మిట్టల్ ఆదాయం 1.8 బిలియన్ల డాలర్లు పెరిగి 18.3 బిలియన్ల డాలర్లకు చేరుకున్నదని ఫోర్బెస్ తెలిపింది. 

లక్ష్మీ మిట్టల్ తర్వాతీ స్థానే హిందూజా బ్రదర్స్ నికర ఆదాయం 18 బిలియన్ల డాలర్లకు, పల్లోంజీ మిస్త్రీ ఆదాయం 15.7 బిలియన్ల డాలర్లకు చేరింది. టాప్ 10 జాబితాలో 14.6 బిలియన్ల డాలర్లతో శివ్ నాడార్, 14 బిలియన్ల డాలర్లతో గోద్రేజ్ కుటుంబం, దిలీప్ సంఘ్వీ ఆదాయం 12.6 బిలియన్ల డాలర్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా ఆదాయం 12.5 బిలియన్ల డాలర్లు, గౌతం ఆదానీ ఆదాయం 11.9 బిలియన్ల డాలర్లకు చేరుకున్నదని ఫోర్బెస్ మ్యాగజైన్ తెలిపింది. 

ఫోర్బెస్ ఆసియా ఇండియా ఎడిటర్ నాజ్నీన్ కర్మాలీ మాట్లాడుతూ బయో టెక్నాలజీ పయనీర్ కిరణ్ మంజుదార్ షా ఈ ఏడాది అత్యధిక శాతం ఆదాయం పొందారన్నారు. జాబితాలో చోటు దక్కించుకున్న నలుగురు మహిళా సంపన్నుల్లో ఒకరిగా ఆమె ఆదాయం 66.7 శాతం పెరిగి 3.6 బిలియన్ల డాలర్లు పెరిగి 39వ ర్యాంక్ సాధించారు. 

ఈ ఏడాదిలో రూపాయి విలువ పతనమైనా, వ్యాపార టైకూన్ల ఆదాయం విలువ గణనీయంగా పెరిగింది. జాబితాలో చోటు దక్కించుకున్న వారందరి ఆదాయం 492 బిలియన్ల డాలర్లకు పెరిగింది. భారతదేశంలోని 100 సంపన్నుల ఆదాయంలో 11 మంది ఆదాయం ఒక బిలియన్ డాలర్ల నుంచి ఎక్కువగానే ఉన్నది. 

భారత ఆర్థిక వ్యవస్థ అడ్వాన్స్ దశలో ఉన్నదనడానికి సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశ సంపన్నుల ఆదాయం మరింత పెరిగింది. వారి సంస్థల ఆదాయం పెరుగుదలకు దారి తీసిందని ఫోర్బెస్ ఇండియా ఎడిటర్ బ్రియాన్ కార్వాల్హో తెలిపారు. స్టాక్ మార్కెట్లలో ఆయా సంస్థల షేర్ల పెరుగుదల, గత నెల 21వ తేదీన డాలర్‌పై రూపాయి విలువ ఆధారంగా సంపన్నుల ఆదాయం, ఆస్తులను ఖరారు చేశామన్నారు. 

click me!