కెయిర్న్ ఇండియా సీఈవో, సీఎఫ్‌వో రాజీనామా

By rajesh yFirst Published Apr 12, 2019, 4:42 PM IST
Highlights

చమురు రంగ దిగ్గజం కెయిర్న్ ఇండియాలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆ కంపెనీ సీఈఓ సుధీర్ మాథూర్ తోపాటు సీఎఫ్ఓ పంకజ్ కల్రా తమ పదవులకు రాజీనామా చేశారు. 

ముంబై: చమురు రంగ దిగ్గజం కెయిర్న్ ఇండియాలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆ కంపెనీ సీఈఓ సుధీర్ మాథూర్ తోపాటు సీఎఫ్ఓ పంకజ్ కల్రా తమ పదవులకు రాజీనామా చేశారు. 

వేదాంత గ్రూప్ చేతికి కెయిర్న్ పగ్గాల వచ్చాక రాజీనామా చేసిన నాలుగో సీఈఓ మాథూర్ కావడం గమనార్హం. మాథూర్ మార్చి నెలలోనే రాజీనామా చేయగా.. ఆ విషయం మాత్రం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. 

ప్రస్తుతం ఆయన నోటీస్ పీరియడ్ కింద పనిచేస్తున్నారు. మే చివరిలో ఆయన కంపెనీ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలుగుతారు. అయితే, రాజీనామాకు గల కారణాలను మాథూర్ వెల్లడించలేదు.

2013లో మయాంక్ అషర్ రాజీనామా చేయగా, తాత్కాలిక సీఈఓగా సుధీర్..   కెయిర్న్ ఇండియాలో చేరారు.  ఇప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వేదంత అల్యూమినియం, పవర్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అజేయ్ దీక్షిత్ కొత్త సీఈఓగా రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

కాగా, అంతకుముందు కంపెనీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సునితి భట్, చీఫ్ ఇంటర్నల్ ఆడిట్, రిస్క్ అస్యూరెన్స్ డైరెక్టర్ అరూప్ చక్రవర్తిలు కూడా తమ పదువుల నుంచి వైదొలిగారు.

click me!