మళ్లీ పెరగనున్న సిమెంట్ ధరలు, బ్యాగ్‌కు రూ.10-30 పెరిగే చాన్స్...కారణాలు ఇవే..

Published : Nov 08, 2022, 12:17 AM IST
మళ్లీ పెరగనున్న సిమెంట్ ధరలు, బ్యాగ్‌కు రూ.10-30 పెరిగే చాన్స్...కారణాలు ఇవే..

సారాంశం

దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలను  పెరిగే అవకాశం ఉందని, ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అంచనా వేసింది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సిమెంట్ దరలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 

గత నెలలోనే ధరలు పెంచిన సిమెంట్ కంపెనీలు నవంబర్‌లోనూ బస్తాకు రూ.10-30 చొప్పున పెంచాయి. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తెలిపిన వివరాల ప్రకారం సిమెంట్ బస్తా ధరలను మరింత పెంచాలని యోచిస్తోంది. అక్టోబర్ లోనే దేశంలో సిమెంట్ ధర బస్తాకు ఈ పెంపు రూ.3-4గా ఉంది. 

గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. నివేదిక ప్రకారం, దక్షిణ , తూర్పు భారతదేశంలో సిమెంట్ ధరలు నెలకు 2 నుండి 3 శాతం పెరిగాయి. పశ్చిమ భారతదేశంలో సిమెంట్ ధర 1% పెరిగింది. అయితే, ఉత్తర , మధ్య భారతదేశంలో మాత్రమే సిమెంట్ ధరలు 1% తగ్గాయి. 'వివిధ ప్రాంతాల్లో సిమెంట్ బస్తాకు రూ.10 నుంచి రూ.30 వరకు పెంచాలని సిమెంట్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ధరల పెంపుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని ఎంకే గ్లోబల్ తెలియజేసింది.

కారణం ఏంటి?
రుతుపవనాల వానలు ఇంకా వదలకపోవడం, అక్టోబర్ పండుగ నేపథ్యంలో సెలవులు రావడంతో నిర్మాణ కార్యకలాపాలపై ప్రభావం పడింది. అలాగే, కార్మికుల సమస్య కూడా సమస్యను సృష్టించింది. ఈ కారణాలన్నింటి కారణంగా అక్టోబర్‌లో సిమెంట్‌ డిమాండ్‌ తక్కువగా ఉంది. అయితే పండుగలన్నీ ముగిసిన తర్వాత నవంబర్‌లో భవన నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయని, సిమెంట్‌కు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని ఎంకే గ్లోబల్‌ నివేదిక పేర్కొంది.

వచ్చే త్రైమాసికంలో సిమెంట్ ఉత్పత్తి వ్యయ ఒత్తిడి తగ్గుతుందని అంచనా వేసింది. దీంతో సిమెంట్ ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు. సెప్టెంబరు త్రైమాసికంలో, సిమెంట్ రంగం చాలా నష్టాలను చవిచూసింది. వర్షాకాలంలో నిర్మాణ పనులు నిలిపివేయడంతో సిమెంట్‌కు డిమాండ్‌ తక్కువగా ఉంది. 

ఉక్కు ధర తగ్గింది..
సిమెంట్ ధర పెరిగింది, ఉక్కు ధర తగ్గింది. గత ఆరు నెలల్లో ఉక్కు ధర 4% తగ్గింది. ఉక్కు ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం 15% సుంకం విధించడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో దేశీయ మార్కెట్‌లో ఉక్కు లభ్యత పెరగడంతో పాటు ధర తగ్గింది. ఏప్రిల్‌లో టన్ను ఉక్కు ధర రూ.78,800కి భారీగా పెరిగింది. అయితే ప్రస్తుతం స్టీల్ ధర సుమారు రూ.57,000గా ఉంది.  ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ఐరన్, స్టీల్, ప్లాస్టిక్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ మేలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 

నవంబర్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. దీంతో సిమెంట్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అంతేకాకుండా గృహ రుణాలపై వడ్డీ రేటు కూడా పెరిగింది. దీంతో ఈఎంఐ భారం పెరిగింది. వీటన్నింటి మధ్య సిమెంట్ ధరల పెంపుతో గృహ నిర్మాణదారుపై భారం పెరిగింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !