ప్రస్తుత పరిస్ధితుల్లో సామాన్యుడు సొంతింటి కలను నిర్మించుకోవడం కష్టంగా మారింది . తాజాగా సిమెంట్ ధరలు త్వరలో భారీగా పెరగనున్నాయి. సిమెంట్ తయారీ కంపెనీలు ప్రస్తుతం వున్న ధరను 12 నుంచి 13 శాతం పెంచాయి. దీని కారణంగా దేశంలో 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.382కి చేరుకుంది.
ప్రస్తుత పరిస్ధితుల్లో సామాన్యుడు సొంతింటి కలను నిర్మించుకోవడం కష్టంగా మారింది. భూముల ధరలు, ఇసుక, సిమెంట్, ఉక్కు, ఇతర నిర్మాణాల వ్యయాలు భారీగా పెరిగాయి. తాజాగా సిమెంట్ ధరలు త్వరలో భారీగా పెరగనున్నాయి. సిమెంట్ తయారీ కంపెనీలు ప్రస్తుతం వున్న ధరను 12 నుంచి 13 శాతం పెంచాయి. దీని కారణంగా దేశంలో 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.382కి చేరుకుంది. ఈశాన్య ప్రాంతాల్లో సిమెంట్ బస్తా ధర రూ.326 నుంచి రూ.400కి పెరిగింది.
సాధారణంగా వర్షాకాలంలో సిమెంట్ ధరలకు గిరాకీ తగ్గి ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే రుతుపవనాల తిరోగమనమే సిమెంట్ ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ముడిసరుకు ధరలు, తయారీ వ్యయాలు పెరగడం వల్ల కూడా సిమెంట్ ధరలు పెరిగినట్లుగా తెలుస్తోంది. బొగ్గు, పెట్‌కోక్ ధరలు గడిచిన మూడు నెలలుగా భారీగా పెరిగాయి. మరోవైపు.. 2025 ఆర్దిక సంవత్సరంలో సిమెంట్ ధరలు అత్యంత వేగంగా పెరుగుతాయని అంచనా.
ఇకపోతే.. గత నెలలో అదానీ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ, ప్రముఖ సిమెంట్ కంపెనీ సంఘీ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 5 వేల కోట్ల రూపాయలు. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, అంబుజా సిమెంట్స్ సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SIL)లో 56.74 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్లు రవి సంఘీ, వారి కుటుంబం నుండి కొనుగోలు చేయనుంది. ఈ డీల్ తర్వాత అంబుజా సిమెంట్ షేర్లు 4.5 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం పెరిగాయి.
సంఘీ సిమెంట్‌కి గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. ఇది 6.6 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్ ప్లాంట్, 6.1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో సిమెంట్ ప్లాంట్‌ను కలిగి ఉంది. సంఘీ ఇండస్ట్రీస్ కి 850 డీలర్ నెట్‌వర్క్ ఉంది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ మార్కెట్లలో కంపెనీ ఉనికిని కలిగి ఉంది.