స్టాక్ మార్కెట్లో ఎన్నికల జోష్.. సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి సెన్సెక్స్-నిఫ్టీ..

By asianet news telugu  |  First Published Dec 4, 2023, 4:11 PM IST

మూడు రాష్ట్రాల మధ్యప్రదేశ్, రాజస్థాన్,  ఛత్తీస్‌గఢ్‌లలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో  స్టాక్ మార్కెట్  ఈ రోజు ఉదయం ఊపందుకుంది. దింతో నేడు  సెన్సెక్స్, నిఫ్టీలు కూడా సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి.


అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దేశీయ స్టాక్‌ మార్కెట్లలో సోమవారం భారీ పెరుగుదల కనిపించింది. ఈ వారంలో మొదటి ట్రేడింగ్ రోజున మూడు రాష్ట్రాల మధ్యప్రదేశ్, రాజస్థాన్,  ఛత్తీస్‌గఢ్‌లలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో స్టాక్ మార్కెట్ సంబరాలు చేసుకుంది.  దింతో నేడు  సెన్సెక్స్, నిఫ్టీలు కూడా సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి.

ఈ సమయంలో, సెన్సెక్స్ మొదటిసారిగా 1,383.93 (2.05%) పాయింట్ల లాభంతో 68,865.12 స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 418.90 (2.07%) పాయింట్లు బలపడి 20,686.80 స్థాయి వద్ద ముగిసింది.  సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5.83 లక్షల కోట్లు పెరిగి రూ.343.51 లక్షల కోట్లకు చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.337.67 లక్షల కోట్లుగా ఉంది.

Latest Videos

 మధ్యాహ్నం 2.30 గంటల వరకు జరిగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,248.89 (1.85%) పాయింట్ల లాభంతో 68,745.67 రికార్డు స్థాయికి చేరుకుంది. మరోవైపు, నిఫ్టీ కూడా 386.70 (1.91%) పాయింట్లు జంప్ చేసి, మొదటిసారిగా 20,654.60 దాటింది. చమురు, గ్యాస్ రంగ షేర్లు అత్యధిక వృద్ధిని కనబరిచాయి.

దలాల్ స్ట్రీట్‌లో బలమైన జోరు కొనసాగుతుందని విశ్లేషకులు సూచించడంతో విస్తృత మార్కెట్ సూచీలు కూడా రికార్డు లాభాలను నమోదు చేశాయి.

2024లో అధికార పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రక్షణ , రైల్వే వంటి రంగాలు ప్రధాన లబ్ధి పొందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిఫ్టీ బ్యాంక్ అండ్  నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో సహా ప్రధాన రంగాల సూచీలు ప్రతి ఒక్కటి 3 శాతానికి పైగా లాభపడటంతో టాప్ పెర్ఫార్మర్స్‌గా ఉన్నాయి. ఈ సెషన్‌లో నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 3 శాతానికి పైగా పెరిగింది.

నిఫ్టీ 50లో ఐషర్ మోటార్స్ 7.45 శాతం పెరిగి ఒక్కొక్కటి రూ. 3,891.20కి చేరుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇతర టాప్ గెయినర్లుగా ఉన్నాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, బ్రిటానియా, హెచ్‌సిఎల్ టెక్, సన్ ఫార్మా, విప్రో టాప్ లూజర్‌గా నిలిచాయి.

ప్రోగ్రెసివ్ షేర్స్ డైరెక్టర్ ఆదిత్య గగ్గర్ మాట్లాడుతూ, “నేటి ట్రేడ్‌లో బుల్స్   బలమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి ఇంకా  ప్రారంభం నుండి ఇండెక్స్ ఎగబాకింది అలాగే ఈ సెషన్‌ను 418.90 పాయింట్ల లాభంతో 20,686.80 వద్ద తాజా గరిష్ట స్థాయి వద్ద ముగించింది.”అని అన్నారు. 

“మీడియా అండ్ ఫార్మా మినహా, బ్యాంకింగ్ అలాగే  ఎనర్జీ టాప్ పెర్ఫార్మర్స్‌గా ఉన్న అన్ని రంగాలు లాభాలతో ముగిశాయి. ఇండెక్స్ బేస్డ్ స్టాక్‌లలో మాత్రమే కొనుగోళ్లు కనిపించడంతో మిడ్ అండ్  స్మాల్‌క్యాప్ సూచీలు బలహీనంగా ఉన్నాయి, ”అని పేర్కొన్నారు.
 

click me!