
గూగుల్ Play Store లో తన అధికారాలను దుర్వినియోగం చేయడంతో పాటు, వ్యాపార పోటీలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI, Googleకు రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. గత వారమే మరో కేసులో గూగుల్‌పై సీసీఐ రూ.1,337.76 కోట్ల జరిమానా విధించింది. గూగుల్‌కు జరిమానా విధించడం వారం వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే నిన్న అమెజాన్, నేడు గూగుల్ ఇలా వరుసగా మల్టీనేషనల్ కంపెనీలు సి సి ఐ చేతిలో మొట్టికాయలు తింటున్నాయి. స్వదేశీ కంపెనీల ప్రయోజనాలను కాలరాస్తూ పలు మల్టీ నేషనల్ కంపెనీలో అనైతిక వ్యాపార పోటీకి ఊతం ఇస్తున్నాయి. దీంతో చిన్న కంపెనీలు మల్టీ నేషనల్ కంపెనీల చేతుల్లో నలిగిపోయి అంతర్థానం అయిపోతున్నాయి. ఈ అనారోగ్యకరమైన వ్యాపార పోటీని దూరం చేసేందుకు అలాగే చిరు వ్యాపారాల ప్రయోజనాలను కాపాడేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సి సి ఐ రంగంలోకి దిగింది. పలు పేమెంట్ యాప్స్ తనకు పోటీ ఇవ్వకుండా గూగుల్ అనైతిక పద్ధతుల్లో వ్యవహరిస్తోందని పలు ఫిర్యాదులు వచ్చాయి దీంతో సిబిఐ రంగంలోకి దిగింది.
భారతదేశంలోని యాప్ స్టోర్ మార్కెట్‌లో స్మార్ట్ మొబైల్ పరికరాల కోసం ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ OS లలో Google ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు CCI తన పరిశోధనలో కనుగొంది. Google Play Store విధానం ప్రకారం యాప్ డెవలపర్‌లు Google Play బిల్లింగ్ సిస్టమ్ (GPBS)ని ఉపయోగించాలి. యాప్ డెవలపర్‌లు GPBSను ఉపయోగించే Google విధానాన్ని అనుసరించకపోతే, వారు తమ యాప్‌లను ప్లే స్టోర్‌లో ఉంచలేరు, తద్వారా ఆండ్రాయిడ్ వినియోగదారుల రూపంలో పెద్ద కస్టమర్ బేస్‌ను కోల్పోతారు. Google ప్రత్యర్థి UPI యాప్‌లను పేమెంట్ ఆప్షన్స్ కు దూరంగా ఉంచుతుందనే ఆరోపణలపై కూడా CCI విచారణ జరిపింది. ఈ విషయాలను పరిశీలించిన తర్వాత, CCI Googleపై ఉల్లంఘన ఆరోపణలను గుర్తించింది.
వ్యాపార పోటీలో అనైతిక పద్ధతులను ఉపయోగించి నిబంధనలను దుర్వినియోగం చేయవద్దని CCI పలుమార్లు Googleని హెచ్చరించింది. అలాగే ఇతర పేమెంట్ యాప్స్ ను Google నిరోధించకూడదని CCI తెలిపింది. అలాగే, ఇప్పుడు భారతదేశంలో UPI ద్వారా చెల్లింపు సౌకర్యాన్ని అందించే యాప్‌లతో Google ఏ విధమైన వివక్ష చూపకూడదని హెచ్చిరించింది.
గూగుల్ రెవెన్యూ డేటా ప్రెజెంటేషన్‌లో అనేక వ్యత్యాసాలు కనిపించాయని CCI తెలిపింది. ఆ తర్వాత Google తాత్కాలిక టర్నోవర్‌పై 7% చొప్పున రూ. 936.44 కోట్ల పెనాల్టీ విధించాలని CCI నిర్ణయించింది. Googleకి ఆర్థిక వివరాలు సంబంధిత పత్రాలను అందించడానికి Googleకి 30 రోజుల సమయం ఇచ్చింది.