ఏటీఎంలలో తగ్గిన క్యాష్‌ విత్‌డ్రాలు..కానీ ఆన్ లైన్ పేమెంట్లు రెట్టింపు..

By Sandra Ashok KumarFirst Published Jun 11, 2020, 3:05 PM IST
Highlights

జూన్ నెలలో ఆర్‌బిఐ బులెటిన్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఎటిఎంల నుండి లావాదేవీలు లేదా నగదు విత్ డ్రాలు మార్చ్ నెలతో పోల్చుకుంటే 54.71 కోట్ల రూపాయల నుండి ఏప్రిల్ లో 28.66 కోట్లు తగ్గింది. ఏప్రిల్ నెలలో దేశంలోని ప్రధాన ప్రాంతాలతో సహ సంపూర్ణ లాక్ డౌన్, కర్ఫ్యు,  ఇందుకు ప్రధాన కారణం.

కరోనా వైరస్ లాక్‌డౌన్ ప్రభావం కారణంగా దేశంలో ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్ (ఎటిఎం) నుండి నగదు విత్ డ్రాలు ఏప్రిల్‌లో దాదాపు  1.27 లక్షల కోట్లకు పడిపోయింది, అదే గత నెలతో పోచుకుంటే మార్చిలో 2.51 లక్షల కోట్ల విత్ డ్రాలు జరిగాయి.

జూన్ నెలలో ఆర్‌బిఐ బులెటిన్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఎటిఎంల నుండి లావాదేవీలు లేదా నగదు విత్ డ్రాలు మార్చ్ నెలతో పోల్చుకుంటే 54.71 కోట్ల రూపాయల నుండి ఏప్రిల్ లో 28.66 కోట్లు తగ్గింది. ఏప్రిల్ నెలలో దేశంలోని ప్రధాన ప్రాంతాలతో సహ సంపూర్ణ లాక్ డౌన్, కర్ఫ్యు,  ఇందుకు ప్రధాన కారణం.

డెబిట్ కార్డులను ఉపయోగించి ఎటిఎంల ద్వారా లావాదేవీలు కూడా ఏప్రిల్‌లో దాదాపు సగానికి పడిపోయి 28.52 కోట్లకు చేరుకుంది. అంతకుముందు నెలలో 54.41 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం 2.34 లక్షల ఎటిఎంలు ఉన్నాయి.

also read 

మార్చిలో కంటే ఏప్రిల్‌లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ వద్ద నగదు విత్‌డ్రా వాల్యూమ్స్‌ స్వల్పంగా పెరిగాయి. ఈ ఏప్రిల్‌లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్)‌ నుంచి రూ.110 కోట్ల నగదు ఉపసంరణ జరిగినట్లు ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి. ప్రజలు నిత్యావసర కొనుగోళ్లకు అత్యధికంగా డిజిటల్‌ చెల్లింపులకే మొగ్గుచూపారు.  

ఈ ఏప్రిల్‌ నాటికి దేశంలో మొత్తం 88.68 కోట్ల కార్డులున్నాయి. ఇందులో 82.94 కోట్ల డెబిట్‌ కార్డులు, 5.73 కోట్ల క్రిడెట్‌ కార్డులున్నాయి. అంతకుముందు నెల మార్చిలో 88.63 కోట్ల కార్డులున్నాయి. 

ఆధార్-ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం ఉపయోగించి మైక్రో ఎటిఎంలలో లావాదేవీలు ఏప్రిల్‌లో 344.98 లక్షల నుండి 875.54 లక్షలకు రెట్టింపు అయ్యింది.
 
click me!