ఆకాశానికి బంగారం ధరలు.. సామాన్యులు కొనలేని స్థాయికి పసిడి, వెండి.. నేడు ఎంత పెరిగిందంటే..?

By asianet news teluguFirst Published Jan 10, 2023, 9:59 AM IST
Highlights

నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర మళ్ళీ పెరిగింది, మరోవైపు వెండి ధర మారలేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.330 పెరిగి రూ.56,290 వద్ద ట్రేడవుతోంది అలాగే కేజీ వెండి ధర రూ.71,800గా ఉంది.

పసిడి ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. దీంతో కొత్త ఏడాదిలో ఊహించని విధంగా బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతేకాకుండా పెళ్లిళ్లు, శుభకార్యాలు సీజన్ కావడంతో పసిడి ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. 

నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర మళ్ళీ పెరిగింది, మరోవైపు వెండి ధర మారలేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.330 పెరిగి రూ.56,290 వద్ద ట్రేడవుతోంది అలాగే కేజీ వెండి ధర రూ.71,800గా ఉంది. నిన్న సోమవారం నాడు బంగారం ధరలు ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిన్నటి ధరతో పోల్చితే ఈ రోజు బంగారం ధర మూడు వందల మేర  పెరిగింది.

ఒక నివేదిక ప్రకారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.51,600గా ఉంది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,290, 22 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,440, 22 క్యారెట్ల  10 గ్రాముల ధర  రూ. 51,750 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల  బంగారం ధర రూ.57,380, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600గా ఉంది.

 0033 GMT నాటికి స్పాట్ బంగారం 0.2 శాతం తగ్గి ఔన్సుకు $1,868.85 డాలర్ల వద్ద ఉంది. అయితే మే 9, 2022 నుండి అత్యధికం. US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.2 శాతం పడిపోయి $1,873.10 డాలర్లకి చేరుకుంది.

ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్  హోల్డింగ్స్ సోమవారం 0.2% పడిపోయి 915.32 టన్నులకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ఈరోజు కిలో వెండి ధర రూ.71,800 వద్ద ట్రేడవుతోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర  రూ.74,900గా ఉంది.

స్పాట్ వెండి 0.1 శాతం నష్టపోయి $23.61 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.1 శాతం తగ్గి $1,077.32 డాలర్లకు చేరుకుంది అలాగే పల్లాడియం $1,775.40 డాలర్ల వద్ద స్థిరపడింది.

click me!