సంపదలో కుబేరుడితో పోటీ మాత్రమే కాదు, దానంలో కర్ణుడితోనూ పోటీ పడుతన్న అదానీ, దాతృత్వ జాబితాలో అగ్రస్థానం

By Krishna AdithyaFirst Published Dec 6, 2022, 11:29 PM IST
Highlights

ప్రపంచ సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో చేరిన గౌతమ్ అదానీ దాతృత్వం విషయంలో కూడా వెనకడుగు వేయలేదు. ఫోర్బ్స్ ప్రచురించిన ఆసియా దాతృత్వవేత్తల 16వ ఎడిషన్‌లో గౌతమ్ అదానీ పేరు మొదటి మూడు స్థానాల్లో చేరింది.

ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ హీరోల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలోని 16వ ఎడిషన్‌లో భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చేరారు. వీరితో పాటు శివ నాడార్, అశోక్ సూతా పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు మలేషియా-భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త బ్రహ్మల్ వాసుదేవన్, అతని లాయర్ భార్య శాంతి కాండియా కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

గౌతమ్ అదానీ ఈ ఏడాది జూన్‌లో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 60,000 కోట్ల రూపాయలు (7.7 బిలియన్ డాలర్లు) స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిశ్చయించారు. ఆ తర్వాత వారిని ఈ జాబితాలో చేర్చారు. దీంతో భారతదేశపు అగ్రగామి పరోపకారి అయ్యాడు. ఈ డబ్బును వైద్యం, విద్య, నైపుణ్యాభివృద్ధికి ఖర్చు చేస్తారు. ఈ మొత్తాన్ని అదానీ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తారు. అదానీ ఫౌండేషన్ 1996లో ఏర్పడింది. గత సంవత్సరం ఈ ఫౌండేషన్ భారతదేశంలో 37 లక్షల మందికి సహాయం చేసింది. 

దాతల్లో శివ నాడార్ రూటే సెపరేటు
తన కష్టార్జితంతో బిలియనీర్‌గా మారిన శివనాడార్ దేశంలోని ప్రముఖ దాతలలో అగ్రగామిగా నిలిచారు. అతను శివ నాడార్ ఫౌండేషన్ ద్వారా ఒక దశాబ్దం కాలంగా సేవా కార్యక్రమాలలో 100 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం ఆయన ఫౌండేషన్‌కు రూ. 11,600 కోట్లు (142 మిలియన్ డాలర్లు ) విరాళంగా ఇచ్చారు. ఈ ఫౌండేషన్ 1994లో స్థాపించబడింది. నాడార్ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు. ఆయన ఫౌండేషన్ సహాయంతో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వంటి అనేక విద్యా సంస్థలను స్థాపించారు. 

టెక్నాలజీ రంగ ప్రముఖుడు అశోక్ సూటా వైద్య పరిశోధన రంగానికి సంబంధించి ట్రస్టుకు రూ. 600 కోట్లు ($75 మిలియన్లు) దానం చేశారు. అతను 2021లో ఈ ట్రస్టును ఏర్పాటు చేశాడు.

ఇక మలేషియా-భారతీయుడు బ్రహ్మల్ వాసుదేవన్, కౌలాలంపూర్ ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్రియేడర్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అతని న్యాయవాది భార్య శాంతి కాండియా క్రియేడర్ ఫౌండేషన్ ద్వారా మలేషియా, భారతదేశంలోని స్థానిక సంఘాలకు మద్దతునిస్తున్నారు. ఇది ఒక NGO. 

click me!