తొలిసారి డిజిటల్ రూపంలో కేంద్ర‌ బ‌డ్జెట్‌ 2021-22.. మొబైల్ యాప్ ద్వారా సామాన్యులకు అందుబాటులోకి..

By S Ashok KumarFirst Published Feb 1, 2021, 10:37 AM IST
Highlights

 కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రజలకు డిజిటల్ మార్గంలో తొలిసారిగా అందుబాటులోకి తిసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 1 న అంటే నేడు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 

కరోనా మహమ్మారి కారణంగా, ఈసారి బడ్జెట్ పత్రాలు యథావిధిగా ముద్రించబడవు. దీనికి బదులు ఈసారి బడ్జెట్ పత్రాలు డిజిటల్ రూపంలో అందించనున్నారు. దీనికి హల్వా వేడుకను నిర్వహించడం ద్వారా ప్రతి సంవత్సరం బడ్జెట్ పత్రాల ప్రచురణ ప్రారంభమవుతుంది. బడ్జెట్ పత్రాలు ప్రచురించకపోవడం ఇదే మొదటిసారి.

 కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రజలకు డిజిటల్ మార్గంలో తొలిసారిగా అందుబాటులోకి తిసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 1 న అంటే నేడు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా, ఆర్థిక మంత్రి సీతారామన్ కేంద్ర బడ్జెట్ మొబైల్ యాప్‌ను కూడా ప్రవేశపెట్టారు, తద్వారా ఎంపీలు, సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిజిటల్ పత్రాలను పొందవచ్చు.

also read నేడే యూనియన్ బడ్జెట్‌ 2021-22.. ఊ. 11 గంటలకు పార్లమెంటులో సమర్పించనున్న ఆర్థిక మంత్రి..


ఈ యాప్ ప్రత్యేకత ఏమిటి
ఈ మొబైల్ యాప్‌లో, వార్షిక ఆర్థిక నివేదిక (బడ్జెట్), గ్రాంట్ డిమాండ్ (డిజి), ఫైనాన్స్ బిల్లు మొదలైన వాటితో సహా రాజ్యాంగం సూచించిన 14 కేంద్ర బడ్జెట్ పత్రాలు అందుబాటులో ఉంటాయి.

యాప్ డౌన్‌లోడ్, ప్రింటింగ్, సెర్చ్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ యాప్ కేంద్ర బడ్జెట్ వెబ్ పోర్టల్ (ఇండియా బడ్జెట్.కామ్ gov.in) నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆర్థిక వ్యవహారాల శాఖ మార్గదర్శకత్వంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) అభివృద్ధి చేసింది.

ఫిబ్రవరి 1 న పార్లమెంటులో ఆర్థిక మంత్రికి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్ పత్రాలు ఈ మొబైల్ యాప్‌లో లభిస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సేవల కార్యదర్శి దేబాషిష్ పాండా, దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే, వ్యయ కార్యదర్శి టివి సోమనాథన్, ముఖ్య ఆర్థిక సలహాదారు కె.వి సుబ్రమణియన్ తదితరులు బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్నారు. .

 కొన్నేళ్లుగా కొనసాగుతున్న హల్వా సంప్రదాయం
కరోనా మహమ్మారి చాలా విషయాలను ప్రజలకు నేర్పింది. ఇందుకు బడ్జెట్‌ను డిజిటల్ మోడ్‌లో ప్రదర్శించడానికి కారణం ఇదే. కానీ దీనికి ముందు ప్రతి సంవత్సరం బడ్జెట్ కోసం పత్రాలను ముద్రించే ముందు హల్వా  సంప్రదాయం ఉంటుంది. హల్వా సిద్ధమైన తరువాత ఆర్థిక మంత్రితో సహా ఇతర మంత్రులు, అధికారులకు అందిస్తారు. సాధారణంగా హల్వా తయారీ వేడుకలో బడ్జెట్ నిర్మాణంలో నిమగ్నమైన అధికారులు మాత్రమే ఉంటారు.

ప్రింటింగ్ పూర్తిగా గోప్యంగా ఉంటుంది
బడ్జెట్ ముద్రణ పూర్తిగా రహస్యమైన పని. బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులు, ఉద్యోగులు మొత్తం ప్రపంచం నుండి 10 రోజులు డిస్‌కనెక్ట్ చేయబడతారు. ఈ 50 మంది అధికారులు, ఉద్యోగులను కూడా ఇంటికి వెళ్ళడానికి అనుమతించరు. ఆర్థిక మంత్రి చాలా సీనియర్ అధికారులు మాత్రమే ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఉంది. 

బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లు గట్టిగా ఉంటాయి. బయటి వ్యక్తి ఎవరూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి ప్రవేశించడానికి లేదు. ఈ సమయంలో ప్రింటింగ్ అధికారులు, ఉద్యోగులు కూడా బయటకు రావడం లేదా వారి సహచరులను కలవడం నిషేధించబడుతుంది. ఒకవేళ ఎవరైనా సందర్శకుడు చాలా ముఖ్యమైన వ్యక్తి అయితే, వారిని భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో లోపలికి పంపుతారు.

ఇంటెలిజెన్స్ విభాగం నుండి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సైబర్ సెక్యూరిటీ సెల్ వరకు అందరికీ రక్షణ ఉంది. ఈ 10 రోజులు మంత్రిత్వ శాఖ లోపల మొబైల్ నెట్‌వర్క్ పనిచేయదు. ల్యాండ్‌లైన్ ఫోన్‌ల ద్వారా మాత్రమే సంభాషణలు చేయవచ్చు. 

వైద్యుల బృందం 
వైద్యుల బృందాన్ని కూడా 10 రోజుల పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలో నియమిస్తారు. ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురైతే అతనికి వైద్య సదుపాయాలు కల్పిస్తారు.  

click me!