నేడే యూనియన్ బడ్జెట్‌ 2021-22.. ఊ. 11 గంటలకు పార్లమెంటులో సమర్పించనున్న ఆర్థిక మంత్రి..

బడ్జెట్ లో కరోనా వైరస్ మహమ్మారిని అధిగమించడానికి అనేక ప్రకటనలు చేయవచ్చు. అలాగే సామాన్యులకు ఉపాధి, పన్ను రాయితీలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రభుత్వం నుండి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. 

Budget 2021: The country's general budget will be presented today at 11am by  Finance Minister  Nirmala Sitharaman

భారత దేశ యూనియన్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సోమవారం అంటే నేడు 11 గంటలకు పార్లమెంటులో సమర్పించనున్నారు. దీనికి  ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఉదయం 10:15 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

ఇందులో 2021-22 బడ్జెట్‌ను సమర్పించే ప్రతిపాదన ఆమోదించబడుతుంది. తరువాత  ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ నుంచి అనుమతి తీసుకోబడుతుంది. దీని తరువాత ఆర్థిక మంత్రి సీతారామన్ ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

బడ్జెట్ లో కరోనా వైరస్ మహమ్మారిని అధిగమించడానికి అనేక ప్రకటనలు చేయవచ్చు. అలాగే సామాన్యులకు ఉపాధి, పన్ను రాయితీలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రభుత్వం నుండి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఇది కాకుండా, విద్య, ఆరోగ్యం, రక్షణకు సంబంధించి కూడా ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చు.  

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, కోవిడ్ -19, లాక్ డౌన్  కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ 2020లో 9.6 శాతం  ప్రభావితమైందని అంచనా.  2021 లో భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం వృద్ధిని నమోదు చేయగలదని తెలిపింది.

ఈ బడ్జెట్ ప్రజలకు చాలా ముఖ్యం ఎందుకంటే ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. కాబట్టి ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి ఆర్థిక మంత్రి ఏమి ప్రకటిస్తున్నారో చూడాలి. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఇతర ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఊహాగానాలు చేశాయి.

also read  ఆర్థిక సర్వే అంటే ఏమిటి..? బడ్జెట్ ముందు ఎందుకు ప్రవేశపెడతారో తెలుసుకోండి.. ...

2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక వృద్ధి రేటులో 7–8 శాతం క్షీణత ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్షీణత సంక్షోభం నుండి ఆర్థిక వ్యవస్థను బయట పెట్టడమే ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాలు.

కోవిడ్ -19 మహమ్మారి వల్ల కలిగిన నష్టాలు  ఈ బడ్జెట్ ద్వారా  కోలుకోవడం ప్రారంభమవుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.  అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, 'ప్రజల అంచనాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుంది. 'సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వస్' మంత్రంపై ప్రభుత్వం పనిచేసింది అని అన్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2019లో తన మొదటి బడ్జెట్‌ను సమర్పించేటప్పుడు సాంప్రదాయ బ్రీఫ్‌కేస్‌ను ఎరుపు వస్త్రంతో  చుట్టిన  'బుక్-అకౌంట్స్' రూపంలోకి మార్చారు. జనవరి ప్రారంభంలో ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని అన్నారు.

ఆర్థిక మంత్రి సీతారామన్ 'కేంద్ర బడ్జెట్ మొబైల్ యాప్'ను ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని ద్వారా బడ్జెట్‌కు సంబంధించిన పత్రాలు  సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయి.  

2021 జనవరి  వరకు 1,19,847 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఈ ఏడాది జీఎస్టీ సేకరణ ఎనిమిది శాతం పెరిగింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios