Budget 2020: బడ్జెట్ ప్రసంగం.. అరుణ్ జైట్లీకి నిర్మలమ్మ నివాళి

By telugu teamFirst Published Feb 1, 2020, 11:32 AM IST
Highlights

యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయన్నారు. జీఎస్టీతో రాష్ట్రాల, కేంద్రాల ఆదాయం పెరిగిందన్నారు. ఎవరికీ ఎలాంటి నష్టం కలగలేదని చెప్పారు. ఒకే పన్ను, ఒకే దేశ విధానం మంచి ఫలితాలను ఇచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ లో ఆమె స్వయంగా బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా ఆమె కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీకి  నివాళులర్పించారు. గతంలో అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు.

Also Read కేంద్ర బడ్జెట్ 2020: కొత్తగా 60 లక్షల మంది కొత్త ట్యాక్స్ పేయర్స్...

ఆ తర్వాత అనారోగ్యం కారణంగా కేంద్ర మంత్రి పదవికి దూరమైన ఆయన గతేడాది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. అనంతరం తన బడ్జెట్ ప్రతిని చదివి వినిపించారు. గత ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి భారీ మెజార్టీతో అధికారం అప్పగించారని చెప్పారు. ఆదాయాలను పెంచేలా, కొనుగోలు శక్తి పెంచేలా ఈ బడ్జెట్ ని తయారు చేసినట్లు చెప్పారు.

యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయన్నారు. జీఎస్టీతో రాష్ట్రాల, కేంద్రాల ఆదాయం పెరిగిందన్నారు. ఎవరికీ ఎలాంటి నష్టం కలగలేదని చెప్పారు. ఒకే పన్ను, ఒకే దేశ విధానం మంచి ఫలితాలను ఇచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

దేశ ప్రజలకు సేవ చేయాలనే దీక్షతో బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. జాతి నిర్మాణంలో యువత, మహిళ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర ఎంతో ఉందన్నారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని పేర్కొన్నారు. కాగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020ని పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి కూడా ఆమెనే బడ్జెట్ ప్రతిపాదించారు.

click me!