మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కొత్త షిప్ చూశారా..?

By Sandra Ashok KumarFirst Published Feb 10, 2020, 1:30 PM IST
Highlights

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు “ఆక్వా సూపర్‌యాచ్ట్‌” పడవ నిర్మాణానికి డచ్ మెరైన్ ఆర్కిటెక్ట్స్ సినోట్ కు ఆర్డర్ చేశారు. ఆక్వా సూపర్‌యాచ్ట్‌ పడవను తయారు చేసింది డచ్ మెరైన్ ఆర్కిటెక్ట్స్ సినోట్. 

లండన్:  మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని ధనికుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌  ప్రపంచంలోని మొట్టమొదటి లిక్విడ్‌ హైడ్రోజన్-శక్తితో నడిచే సూపర్‌యాచ్ట్‌ను కొనుగోలు చేశారు. దీని పేరు ఆక్వా సూపర్‌యాచ్ట్‌. దీని విలువ  644 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.4600 కోట్లు.

also read టాక్స్ చెల్లించే వారికోసం కొత్త ఆదాయపు పన్ను విధానం....

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు “ఆక్వా సూపర్‌యాచ్ట్‌” పడవ నిర్మాణానికి డచ్ మెరైన్ ఆర్కిటెక్ట్స్ సినోట్ కు ఆర్డర్ చేశారు. ఆక్వా సూపర్‌యాచ్ట్‌ పడవను తయారు చేసింది డచ్ మెరైన్ ఆర్కిటెక్ట్స్ సినోట్. ఈ పడవను మొదటిగా గత సంవత్సరం మొనాకో యాచ్ షోలో ప్రదర్శించారు. ఈ పడవకి మంచి స్పందన కూడా వచ్చింది. 

బిల్‌గేట్స్‌ కొనుగోలు చేసిన సూపర్‌యాచ్‌ పొడవు 370 అడుగులు. ఇందులో 5 డెక్‌లు ఉంటాయి. 14 మంది అతిథులు, 31 మంది సిబ్బంది ఈ బోట్‌లో వెళ్లవచ్చు. అలాగే ఒక జిమ్‌, యోగా స్టూడియో, బ్యూటీ రూం, మసాజ్‌ పార్లర్‌, స్విమ్మింగ్‌ పూల్‌ తదితర సదుపాయాలు ఈ బోట్‌లో ఉన్నాయి. కాగా ఈ బోట్‌ను బిల్‌గేట్స్‌ తరచూ వెకేషన్‌కు వెళ్లేందుకు గాను కొనుగోలు చేశారు. 

దీని షిప్ టాప్  స్పీడ్ 17 నాట్స్ అని పేర్కొన్నారు. ఒక్కసారి ఇంధనం నింపితే దాదాపు 6,000 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో రెండు హైడ్రోజన్ ఇంధన ట్యాంకులు ఉంటాయి. ఇవి రెండూ 28 టన్నుల బరువు ఉంటుంది. ఈ షిప్ 2024 నాటికి సిద్ధం అవుతుందని భావిస్తున్నారు.

also read  నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌... సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం

లిక్విడ్ హైడ్రోజన్ ఇప్పటికే లండన్, సావో పాలో, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో ఇంధన-సెల్ బస్సులలో  ఉపయోగిస్తున్నారు. అలాగే  ప్రోటోటైప్స్ ప్రయాణీకుల కార్లు, అంతరిక్ష నౌక ప్రొపల్షన్లలో కూడా ఉపయోగించారు. 64  ఏళ్ల  బిల్ గేట్స్ మొత్తం ఆస్తి 110 బిలియన్ డాలర్లు. బిల్ గేట్స్ సెలవులు, వేసవి సమయంలో  పర్యటనల కోసం ఈ  పడవలను అద్దెకు తీసుకుంటాడు.
 

click me!