అంతర్జాతీయ విపణిలోకి భీమ్.. సింగపూర్‌‌‌‌లో ప్రారంభం...

By Sandra Ashok KumarFirst Published Nov 14, 2019, 10:31 AM IST
Highlights

దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ‘భీమ్’ యాప్ తాజాగా సింగపూర్ మార్కెట్లోకి ప్రవేశించింది. తద్వారా అంతర్జాతీయంగానూ సేవలందించేందుకు ముందడుగు వేసింది.

సింగపూర్: డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల యాప్ ‘భీమ్’ ఇంటర్నేషనల్ మార్కెట్‌‌లోకి ప్రవేశించింది. భీమ్ యూపీఐ క్యూఆర్‌‌‌‌ ఆధారిత పేమెంట్స్‌‌ను సింగపూర్‌‌‌‌లో ప్రారంభించింది. ప్రస్తుతం జరుగుతున్న సింగపూర్ ఫిన్‌‌టెక్ ఫెస్టివల్-2019లో మెర్చంట్ టర్మినల్‌‌ వద్ద లైవ్ ట్రాన్సాక్షన్ నిర్వహించడం ద్వారా తన పైలెట్ డెమో విజయవంతంగా పూర్తి చేసింది.

also read  పెండ్లిళ్ల సీజన్: ఊపందుకున్న బంగారం కొనుగోళ్లు

భీమ్ యాప్ డెమో కార్యక్రమం శుక్రవారం వరకు జరగనుంది. ఈ క్యూఆర్‌‌‌‌ కోడ్ ఆధారిత సిస్టమ్‌‌ భీమ్ యాప్‌‌తో సింగపూర్‌‌‌‌లో ఎన్‌‌ఈటీఎస్‌‌ టర్మినల్స్ వద్ద ఎస్‌‌జీక్యూఆర్‌‌‌‌ స్కాన్‌తో చెల్లింపులు జరుపడానికి అనుమతించనుంది. 

భీమ్ యాప్‌‌ను ఇంటర్నేషనల్‌‌గా తీసుకెళ్లడం ఇదే తొలిసారని సింగపూర్‌‌‌‌లో ఇండియన్ హై కమిషనర్‌ జావెద్ అస్రఫ్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌‌పీసీఐ), నెట్‌‌వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌‌ఫర్స్(ఎన్‌‌ఈటీఎస్) ఫర్ సింగపూర్ కలిసి డెవలప్‌‌ చేశాయి. 

2020 ఫిబ్రవరి వరకు దీన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యం‌గా పెట్టుకున్నట్టు హై కమిషనర్ చెప్పారు. ఇండియా, సింగపూర్‌‌‌‌ మధ్య ఫిన్‌‌టెక్‌‌ కోఆపరేషన్‌‌ చేపట్టడంలో ఇది మరో మైలురాయి అని అన్నారు. గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపే ఇంటర్నేషనల్ కార్డును, ఎస్‌‌బీఐ రెమిటెన్స్ యాప్‌‌లను లాంచ్ చేశారు.

also read  తొలి భారతీయురాలిగా నీతా అంబానీకి అరుదైన గౌరవం

ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(టీపీసీఐ)కు, మోనిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్)కు మధ్య మెమోరాండం ఆఫ్ అండర్‌ ‌‌‌స్టాండింగ్ (ఎంఓయూ) కూడా కుదిరింది. సింగపూర్‌‌‌‌లో జరుగుతున్న ఫిన్‌‌టెక్ ఫెస్టివల్ 2019లో భారత్ నుంచి 43 కంపెనీలు, స్టార్టప్‌‌ సంస్థలు పాల్గొంటున్నాయి.

click me!