షేర్ మార్కెట్‌లో పతనం, ఇన్వెస్టర్లకు నష్టాలతో చాలామంది FDలో పెట్టుబడి వైపు మొగ్గు చూపుతున్నారు. వాళ్లని ఆకట్టుకునేలా కొన్ని బ్యాంకులు కస్టమర్లకు FDలపై 9.5% వరకు వడ్డీ ఇస్తున్నాయి, దీనివల్ల మీ డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలంలో మంచి రిటర్నులు ఇస్తాయి.
Fixed Deposit Latest Rate: గత కొన్ని నెలలుగా షేర్ మార్కెట్‌లో భారీ పతనం కొనసాగుతుండటంతో ప్రజలు సురక్షితమైన మార్గం వెతుకుతున్నారు. వారికి ప్రస్తుతం నమ్మశక్యంగా కనిపిస్తున్న సాధనం ఫిక్స్‌డ్ డిపాజిట్. ఇక్కడ జమ చేయడం ద్వారా మంచి రాబడితోపాటు మీ డబ్బును భద్రంగా ఉంచుకోవచ్చు. చాలా బ్యాంకులు FDలపై మంచి వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని 9.50% వరకు వడ్డీని ఇస్తున్నాయి.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన కస్టమర్లకు 4.50% నుండి 9% వరకు వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 4.5% నుండి 9.50% వరకు వడ్డీ ఇస్తున్నారు. ఈ వడ్డీ రేటు 3 కోట్ల రూపాయల కంటే తక్కువ ఎఫ్‌డిలపై వర్తిస్తుంది. కొత్త రేట్లు అక్టోబర్ 7, 2024 నుండి అమలులోకి వచ్చాయి.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన కస్టమర్లకు 3.50% నుండి 9% వరకు వడ్డీని ఇస్తోంది. ఈ వడ్డీ రేటు 3 కోట్ల రూపాయల కంటే తక్కువ ఎఫ్‌డిలపై ఇస్తున్నారు. ఈ రేట్లు జనవరి 18, 2025 నుండి అమలులోకి వచ్చాయి.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్లకు 4% నుండి 8.5% వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, సీనియర్ సిటిజన్ల కోసం 4.6% నుండి 9.10% వరకు వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయల కంటే తక్కువ ఎఫ్‌డిలపై వర్తిస్తాయి. అన్ని వడ్డీ రేట్లు జూన్ 7, 2024 నుండి అమలులోకి వచ్చాయి.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన రెగ్యులర్ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5% నుండి 8.25% వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం 4% నుండి 9% వరకు వడ్డీ ఇస్తోంది. అన్ని రేట్లు 3 కోట్ల రూపాయల కంటే తక్కువ ఎఫ్‌డిలపైనే వర్తిస్తాయి. FDల యొక్క అన్ని రేట్లు డిసెంబర్ 2, 2024 నుండి అమలులోకి వచ్చాయి.