కాగ్నిజెంట్ ఇండియా చీఫ్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీనామా

Ashok Kumar   | Asianet News
Published : Jul 11, 2020, 06:52 PM ISTUpdated : Jul 11, 2020, 10:52 PM IST
కాగ్నిజెంట్ ఇండియా చీఫ్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీనామా

సారాంశం

 కాగ్నిజెంట్ ఇండియా కంపెనీలో రామ్మూర్తి సుమారు 23 ఏళ్లపాటు పనిచేశారు. ఈయన 2019లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశంలో విద్యా రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకున్నాట్లు తెలిపారు. 

కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామ్‌కుమార్ రామమూర్తి సంస్థతో 23 సంవత్సరాల తరువాత తన  పదవులకి రాజీనామా చేశారు. "కాగ్నిజెంట్ లో రామ్‌కుమార్ జూలై 17, 2020న తాను   పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు" అని సిఇఒ బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు ఇచ్చిన నోట్‌లో పేర్కొన్నారు.

4కాగ్నిజెంట్ ఇండియా కంపెనీలో రామ్మూర్తి సుమారు 23 ఏళ్లపాటు పనిచేశారు. ఈయన 2019లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశంలో విద్యా రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకున్నాట్లు తెలిపారు. ఇందుకోసం కొన్ని ఎంపికలు కూడా వచ్చాయని  రామమూర్తి సూచించారు.

also read డీమార్ట్‌ పై కరోనా వైరస్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన లాభాలు ...

ఇదే కంపెనీలో 24ఏళ్ల పాటు సేవలు అందించిన కాగ్నిజెంట్ గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే కూడా సెప్టెంబర్ 30న వైదొలగనున్నారు. టెక్నాలజీ మేజర్, గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే స్థానంలో ఆండీ స్టాఫోర్డ్‌ను భర్తీ చేసింది, అతను దాదాపు రెండు దశాబ్దాలుగా యాక్సెంచర్‌లో పనిచేశారు.

సిఇఒ బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు పంపిన తన ఇమెయిల్‌లో "కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని  వానికిస్తున్న సమయంలో రామ్‌కుమార్ నాయకత్వ పాత్రకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము, ఈ సమయంలో మీరు క్లయింట్ లకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి" అని పేర్కొన్నారు.

అతను కాగ్నిజెంట్ లో కాగ్నిజెంట్ ఇంటరాక్టివ్, మార్కెట్ రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్, కార్పొరేట్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్, ప్రభుత్వ ఇంకా కార్పొరేట్ వ్యవహారాలలో కీలక పాత్ర పోషించాడు. అతను సంస్థ వ్యూహం, కార్యకలాపాలను నడిపించే బాధ్యత కలిగిన కాగ్నిజెంట్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ బృందంలో సభ్యుడి‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇండియాతో సహా సంస్థలో సీనియర్ పదవి బాధ్యతలనీ  నిర్వహించారు.
 

PREV
click me!

Recommended Stories

Gold : బంగారం పై అమెరికా దెబ్బ.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !