ఐటీ సిటీ బెంగళూరులో Xactly ఆఫీస్ విస్తరణ... కీలక ప్రకటన

By Arun Kumar P  |  First Published Jun 25, 2024, 6:19 PM IST

ఐటీ హబ్ బెంగళూరులో మరో సంస్థ తమ కార్యాకలాపాలను విస్తరించేందుకు సిద్దమయ్యింది. తద్వారా ఉద్యోగాల కల్పన జరగడమే కాదు ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. 


బెంగళూరు :  ఐటీ సిటీ బెంగళూరులోని తమ కార్యాలయాన్ని విస్తరించనున్నట్లు Xactly సంస్థ  ప్రకటించింది. ఇంటెలిజెంట్ రెవెన్యూ సొల్యూషన్ లో గ్లోబల్ లీడర్ గా వున్న ఈ సంస్థ విస్తరణ నిర్ణయం కీలక పరిణామమే అని చెప్పాలి. క్షేత్రస్థాయికి సంస్థ సేవలను తీసుకెళ్లాలన్న నిబద్దతను ఈ విస్తరణ నిర్ణయం తెలియజేస్తుంది.  

Xactly ఆఫీస్ బెంగళూరులోని టెక్ హబ్ లో వుంది. ఇక్కడి నుండే ఈ సంస్థ  గ్లోబల్ ఆపరేషన్స్ సాగుతుంటాయి. ప్రోడక్ట్ డెవలప్ మెంట్,  ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, కస్టమర్ సపోర్ట్ తో పాటు ఇన్నోవేషన్ సేవలు కూడా ఇక్కడినుండే సాగుతాయి. తాజాగా Xactly  సంస్థ విస్తరణ నిర్ణయం కూడా వ్యూహాత్మకమే అని చెప్పాలి.  

Latest Videos

undefined

బెంగళూరులోని Xactly సంస్థ సాగిస్తున్న కార్యకలాపాలివే..: 

ప్రొడక్ట్ డెవలప్ మెంట్ మరియు ఇంజనీరింగ్ :  Xactly రెవెన్యూ సొల్యూషన్స్ యెక్క అభివృద్ది మరియు క్రియెషన్స్ సేవలు నడిపించడం. 

కస్టమర్ సపోర్ట్ :  కస్టమర్లకు వరల్డ్ క్లాస్  సపోర్ట్ అందిస్తున్నారు. కస్టమర్స్ తమ సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసేలా చూడటం. 

సేల్స్ ఆండ్ మార్కెటింగ్ : స్థానిక మార్కెట్ లో ఉనికి చాటడంతో పాటు కస్టమర్స్ కు మరింత చేరువయ్యేలా సేవలు మెరుగుపరచడం.

రీసర్చ్ ఆండ్ డెవలప్ మెంట్ : కొత్త కొత్త ఫీచర్స్ మరియు టెక్నాలజీతో ఇన్నోవేటివ్ గా పనిచేయడం. 

ఇక Xactly విస్తరణ నిర్ణయంతో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. ఇండియా మార్కెట్ లో వేగంగా విస్తరించేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించారు... ఇందులో ఉద్యోగుల పాత్ర చాలా కీలమైనది. ప్రపంచవ్యాప్తంగా వున్న తమ కస్టమర్లకు మరింత ఉత్తమ సేవలు అందించేందుకు ఉద్యోగుల పెంపు ఉపయోగపడుతుంది. 

ఈ విస్తరణపై Xactly ఇండియా జనరల్ మేనేజర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కందర్ప్ దేశాయ్ మాట్లాడుతూ... ఇండియా ఆఫీస్ విస్తరణ అనేది ఇన్నోవేషన్ మరియు గ్రోత్ లో  Xactly కమిట్ మెంట్ ను తెలియజేస్తుందని అన్నారు. తమకు భారత మార్కెట్ చాలా క్లిష్టమైనది...  అయితే కంపనీ విస్తరణ ద్వారా టాలెంట్ పూల్ చేపట్టి కస్టమర్స్ కు ఉత్తమ సేవలు అందిస్తామన్నారు. విస్తరణ తర్వాత తమ జర్నీ ఆసక్తికరంగా సాగనుందని ఆయన తెలిపారు. 

ఇండియాలోని Xactly ఆఫీస్ ఆ కంపనీ సక్సెల్ లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఇప్పుడు విస్తరణ ద్వారా లోకల్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూనే కంపనీని మరింత అభివృద్ది చేయాలని చూస్తున్నారు. శరవేగంగా ఇండియా మార్కెట్  లోకి చొచ్చుకెళ్లాలని Xactly చూస్తోంది. 

Xactly విస్తరణ ఫలితాలివే..: 

స్థానికంగా ఉద్యోగావకాశాలు, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది. 

Xactly సేవల్లో నాణ్యత మరియు వేగం పెరుగుతుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ లో ఈ సంస్థ మరింత బలమైన  పోటీదారుగా మారుతుంది. 

భారతదేశంలో బలమైన కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను ప్రోత్సహించబడతాయి.

click me!