
2025 మే నెలలో బ్యాంక్ ఆఫ్ బారోడా (BoB), కోటక్ మహీంద్రా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీరేట్లను తగ్గించాయి. రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీలో మార్పులు చేశారు. ఈ రేట్లు మే 5, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంతకు ముందు ఏప్రిల్ 2025లో కూడా ఈ రెండు బ్యాంకులు వడ్డీరేట్లను పునఃసమీక్షించాయి.
బ్యాంక్ ఆఫ్ బారోడా రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 4% నుంచి 7.10% వడ్డీను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇది 4.50% నుంచి 7.60% వరకు ఉంది. స్పెషల్ స్కీం అయిన Square Drive Deposit Scheme (444 డేస్) లో 7.10%, సీనియర్ సిటిజన్లకు 7.60%, సూపర్ సీనియర్స్‌కు 7.70% వడ్డీ లభిస్తుంది. ఇది మునుపటి 7.15% (జనరల్), 7.65% (సీనియర్స్), 7.75% (సూపర్ సీనియర్స్) కంటే తగ్గింది.
వివిధ FDలపై వడ్డీ శాతం:
ఇది కాకుండా సీనియర్, సూపర్ సీనియర్స్ కోసం అదనపు వడ్డీ ప్రయోజనాలు కొనసాగుతున్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్ 180 రోజుల FDపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు (0.50%) తగ్గించింది. 7% నుంచి 6.50%కి తగ్గించి, మే 5, 2025 నుంచి అమలులోకి తీసుకొచ్చారు.
వివిధ FDలపై వడ్డీ రేట్లు:
ఈ తాజా మార్పులు సీనియర్ సిటిజన్లతోపాటు సాధారణ ఖాతాదారులపై ప్రభావం చూపుతాయి. దీంతో సురక్షిత పెట్టుబడి మార్గంగా FDలు ఎంచుకునే వినియోగదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.