ఐఫోన్ 17 ప్రో లో ఆ ఫీచర్ ఉండదట.. ఐఫోన్ అభిమానులకు నిరాశే

Published : Apr 30, 2025, 12:46 PM IST
ఐఫోన్ 17 ప్రో లో ఆ ఫీచర్ ఉండదట.. ఐఫోన్ అభిమానులకు నిరాశే

సారాంశం

iPhone 17: ఐఫోన్ అభిమానులు 17 సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల యాపిల్ కంపెనీ ఓ నిర్ణయం తీసుకుందట. దాని వల్ల ఓ ఐఫోన్ ను ప్రొటెక్ట్ చేసే చక్కటి ఫీచర్ 17 సిరీస్ లో ఉండదని వార్తలు వస్తున్నాయి. అదేంటో తెలుసుకుందాం రండి. 

ఒకరంగా ఆపిల్ అభిమానులను నిరాశపరిచే విషయం ఇది. ఎందుకంటే ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ మోడల్స్ కోసం ఐఫోన్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ మోడల్స్ పై గతంలో వచ్చిన వార్తలను బట్టి ఐఫోన్ 17 ప్రో, మ్యాక్స్ ఫోన్లలో డిస్ప్లే సాంకేతికత ఉండకపోవచ్చు. ప్రొడక్షన్ లో సమస్యల కారణంగా ఆపిల్ కొత్త యాంటీ రిఫ్లెక్టివ్, స్క్రాచ్ రెసిస్టెంట్ కవరింగ్ చేసే డిస్ప్లే వేయడాన్ని విరమించుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 

ముందే ప్లాన్ చేసినా ఇప్పుడు కుదరడం లేదు

ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్ల స్క్రీన్‌లకు ఆపిల్ ప్రత్యేకమైన యాంటీ రిఫ్లెక్టివ్, స్క్రాచ్ రెసిస్టెంట్ లేయర్ ఏర్పాటు చేస్తుందని టెక్ నిపుణులు భావించారు. అయితే Mac Rumors ప్రచురించిన వివరాల ప్రకారం టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ ఈ ఫీచర్ ఏర్పాటు చేయడం లేదని తెలిసింది.

ప్రో మోడళ్లలో మాత్రమే కొత్త లేయర్‌ను ఉపయోగించాలని ఆపిల్ ముందుగా ప్లాన్ చేసినప్పటికీ మాస్ ప్రొడక్షన్ సమస్యల కారణంగా ఈ సంవత్సరం ఈ ఫీచర్ తీసుకురావడం లేదని తెలిసిండి. 

ఒలియోఫోబిక్ లేయర్

ఐఫోన్ 11 సిరీస్ నుండి ఆపిల్ వేలిముద్రలకు నిరోధకతను కలిగి ఉన్న ఒలియోఫోబిక్ లేయర్ ను ఉపయోగిస్తోంది. ఇది స్క్రీన్‌పై ఆయిల్ మరకలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఐఫోన్ 17 సిరీస్ ఈ లేయర్ ని ఉపయోగించడం కొనసాగించినప్పటికీ త్వరలో రానున్న ప్రో మోడళ్లలో అదనపు హార్డ్, యాంటీ రిఫ్లెక్టివ్ లేయర్ ఉండదని తెలుస్తోంది. 

ఐఫోన్ 17 సిరీస్ లో ఏ ఫీచర్స్ ఉంటాయి?

ఐఫోన్ 17 సిరీస్ 2025 సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఇందులో ఈ ఫీచర్స్ ఉండే అవకాశాలున్నాయి. 

ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్ లేదా ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వేరియంట్‌లలో వస్తుంది. 

నివేదికల ప్రకారం సాధారణ ఐఫోన్ 17, స్లిమ్ వేరియంట్‌లలో A18 లేదా A19 ప్రాసెసర్, 8GB RAM ఉండవచ్చు.

ప్రో మోడళ్లలో అల్యూమినియం ఫ్రేమ్, A19 ప్రో చిప్, 12GB RAM ఉండవచ్చు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు