Bank Holidays in August: రేపటి నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు..ఆగస్టులో మిగిలిన సెలవలు అవే..

Published : Aug 17, 2022, 09:13 PM IST
Bank Holidays in August: రేపటి నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు..ఆగస్టులో మిగిలిన సెలవలు అవే..

సారాంశం

ఆగస్టు నెలలో అనేక పండుగలు ఉన్నాయి. వీటిలో రక్షా బంధన్, ముహర్రం, స్వాతంత్ర దినోత్సవం సెలవలు పూర్తయ్యాయి. అయితే ఇంకా జన్మాష్టమి, వినాయక చవితి వంటి పండగల సెలవలు మిగిలి ఉన్నాయి. ఆర్‌బీఐ బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను ఆగస్టు నెలలో రేపటి నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవలు ప్రకటించారు. వాటి లిస్ట్ ఏంటో చూద్దాం. 

ఆగస్ట్ నెల అంటేనే ఫెస్టివల్ సీజన్. ఒకదాని తర్వాత ఒకటి అనేక పండుగలు వరుసగా ఉంటాయి. ఈ కారణంగా బ్యాంకు ఉద్యోగులకు ఈ నెలలో చాలా సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే మొహర్రం, రక్షాబంధన్, ఆగస్టు 15 సందర్భంగా బ్యాంకులకు సెలవలు ఇచ్చారు. ప్రస్తుతం ఇంకా  శ్రీ కృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి వంటి పండుగలు ఇంకా రావలసి ఉంది. 

శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రోజులలో జరుపుకుంటారు. దీని కారణంగా, ఆగస్టు 18న బ్యాంకులు కూడా మూసివేస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రదేశాల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఆగస్టు 19, 20 తేదీలలో జరుపుకుంటున్నారు. అంటే రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవలు రాబోతున్నాయి. రాబోయే రెండు వారాల పాటు ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవలు ఉన్నాయో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆగస్టు 18, 19, 20 తేదీలలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవలు ప్రకటించారు. 

18 ఆగస్టు - గురువారం - జన్మాష్టమి
ఒరిస్సా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు

19 ఆగస్టు - శుక్రవారం - జన్మాష్టమి
గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, సిక్కిం, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 

20 ఆగస్ట్ - శ్రీ కృష్ణ జన్మాష్టమి
హైదరాబాద్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి.

21 ఆగష్టు - ఆదివారం

ఈ నెలలో ఇతర సెలవులు
29 ఆగస్టు - శ్రీమంత్ శంకర్‌దేవ్ తేదీ - గౌహతి
31 ఆగస్టు - వినాయక చవితి, దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. 

ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు మినహా అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు. ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల ఆధారంగా బ్యాంకు ఉద్యోగులకు వివిధ నగరాల్లో పండుగ సెలవులు లభిస్తాయి.

PREV
click me!

Recommended Stories

Silver : వెండి దెబ్బకొట్టిందిరా సామీ.. భారీగా పడిపోయిన ధరలు.. మార్కెట్ లో ఏం జరుగుతోంది?
Price Drop on TVs : శాంసంగ్ స్మార్ట్ టీవిపై ఏకంగా రూ.17,000 తగ్గింపు.. దీంతో మరో టీవి కొనొచ్చుగా..!