మే చివరి నాటికి ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ.. త్వరలోనే ఫైనాన్షియల్‌ బిడ్లు: హర్దీప్ సింగ్ పూరి

By S Ashok KumarFirst Published Mar 27, 2021, 6:34 PM IST
Highlights

ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం ప్రభుత్వానికి ముందు ఉన్న ఏకైక ఆప్షన్ అని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు.  

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ మే చివరి నాటికి పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం ప్రభుత్వానికి ముందు ఉన్న ఏకైక ఆప్షన్ అని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు.  

ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి  ఈ అంశంపై మాట్లాడుతూ ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు సంబంధించిన నూతన కాల వ్యవధిని పరిశీలిస్తున్నట్టు  తెలిపారు. రానున్న రోజుల్లో ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల విక్రయానికి ఆర్థిక బిడ్లకు ఆహ్వానం పలకనున్నట్టు చెప్పారు.

బిడ్డర్లు పరిశీలించేందుకు వీలుగా డేటా రూమ్‌ను అందుబాటులో ఉంచామని, ఆర్థిక బిడ్లకు 64 రోజల వ్యవధి ఉందని చెప్పారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ఎయిరిండియాను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తామన్నారు. 

ఎయిర్ ఇండియా ప్రభుత్వా యజమాన్యంలోనిది. అయితే దాని మొత్తం 100 శాతం వాటా విక్రయించేందుకు కొనుగోలుదారుల కోసం చూస్తుంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను 2007లో ఎయిర్ ఇండియాతో విలీనం చేశారు. ఆ తర్వాత నష్టాల్లో మునిగిపోయింది.

also read వాటర్ బాటిల్ అమ్మకాలపై కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుండి అమలు.. అదేంటో తెలుసుకోండి.. ...

రోజుకు రూ.20 కోట్ల నష్టం
విమానయాన శాఖ మంత్రి  మాట్లాడుతూ, 'మాకు వేరే మార్గం లేదు. లేదంటే దానిని ప్రైవేటీకరించాలి లేదా మూసివేయాలి. ఎయిర్ ఇండియా ఇప్పుడు డబ్బు సంపాదిస్తోంది, కానీ ప్రస్తుతం రోజుకు 20 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. మిస్ మేనేజ్మెంట్ కారణంగా ఎయిర్ ఇండియా మొత్తం అప్పు 60,000 కోట్ల రూపాయలకు చేరుకుంది.

స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అయిన అజయ్‌సింగ్‌ ఎలాగైనా ఎయిరిండియాను సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎయిరిండియా లో 100శాతం వాటాను సొంతం చేసుకునేందుకు రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీతోపాటు ఢిల్లీకి చెందిన బర్డ్‌ గ్రూపు ప్రమోటర్‌ అంకుర్‌ భాటియాతో జతకట్టారు.

సింగ్, భాటియా ఇరువురూ తమ వ్యక్తిగత హోదాలో ఎయిరిండియా కోసం బిడ్లు దాఖలు చేశారని సంబంధిత ఉన్న వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టాటా గ్రూపు సైతం ఎయిరిండియా కోసం పోటీపడుతోంది.

click me!