Salary Hike In India: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అలాంటి ఉద్యోగులకు 25% శాలరీ హైక్‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 07, 2022, 03:00 PM IST
Salary Hike In India: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అలాంటి ఉద్యోగులకు 25% శాలరీ హైక్‌..!

సారాంశం

ఉద్యోగులకు శుభవార్త. వేతనాలు భారీగా పెరగబోతున్నాయి. దేశంలో కంపెనీలు ఈసారి ఉద్యోగులకు మంచి వేతన పెంపును ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది వేతనాలు గత ఏడాది కన్నా ఎక్కువగానే పెరగొచ్చని తెలుస్తోంది. దీని వల్ల ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది.  

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. ప్రైవేటు రంగంలోని వారికి ఈ ఆర్థిక ఏడాదిలో వేతనాలు భారీగా పెరిగే ఛాన్స్‌ ఉంది. కనీసం 8-12 శాతం వరకు పెరుగుతాయని తాజా నివేదికలో తెలిసింది. దేశవ్యాప్తంగా పెట్టుబడులకు వాతావరణం అనువుగా ఉండటంతో కంపెనీలు సగటున 9 శాతం హైక్‌ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. తయారీ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇందుకు దోహదం చేస్తోంది. కరోనా ముందు 2019లోని 7 శాతం సగటు పెంపుతో పోలిస్తే 2022లో 9 శాతంగా ఉందని మైకేల్‌ పేజ్‌ శాలరీ రిపోర్టు 2022 తెలిపింది.

యూనికార్న్‌, కొత్త తరహా స్టార్టప్‌లు, పెద్ద సంస్థలు 12 శాతం వరకు వేతనాలు పెంచుతాయని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ప్రాపర్టీ, కన్స్‌స్ట్రక్షన్‌ వంటి గ్రోత్‌ కంపెనీలు దీనిని కొనసాగిస్తాయని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ-కామర్స్‌, ఇతర సంస్థలు డిజిటలైజ్‌ అవుతుండటంతో కంప్యూటర్‌ సైన్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న సీనియర్‌ లెవల్‌ ఉద్యోగులు తమ వేతనాలను భారీగా పెంచుకొనేందుకు డిమాండ్‌ చేయొచ్చని నివేదిక తెలిపింది. వారి జీతాలు ఊహించిన స్థాయి కన్నా ఎక్కువ పెరుగుతాయని పేర్కొంది. డేటా సైంటిస్టులు, వెబ్‌ డెవలపర్లు, క్లౌడ్‌ ఆర్కిటెక్టులకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. మంచి యూనివర్సిటీ నుంచి పట్టాలు పొందిన వారికీ డిమాండ్‌ పెరుగుతోంది.

ఒకే తరహా ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్లు ఉన్న ఉన్నతోద్యోగులతో పోలిస్తే టెక్నాలజిస్టులు సగటు వేతనాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల్లో టాప్‌ ఫెర్ఫామర్లకు కంపెనీలు స్వల్పకాల, క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ అప్రైజల్స్‌, ప్రమోషన్లు, వేరియబుల్‌ పేమెంట్లు, స్టాక్‌ ఇన్సెంటివులు, రీటెన్షన్‌ బోనసులు, మిడ్‌ టర్మ్‌ ఇంక్రిమెంట్ల రూపంలో వేర్వేరు ఆఫర్లు ఇవ్వనున్నాయి.

మున్ముందు కరోనా వైరస్‌తో ఎక్కువ ఇబ్బందులు ఉండకపోవచ్చని కంపెనీలు, యజమానాలు భావిస్తున్నారు. మార్కెట్‌పై దాని ప్రభావం ఎక్కువగా ఉండదని అంచనా వేస్తున్నారు. అందుకే బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇవ్వనున్నాయి. వీరికి కనీసం 20-25 శాతం సగటు ఇంక్రిమెంట్లు ఉంటాయని నివేదిక తెలిపింది. 'కరోనా మహమ్మారిని మనం దాటేశామన్న సానుకూల దృక్పథం అందరిలోనూ ఉంది. ఉద్యోగ నియామకాల మార్కెట్‌ సైతం బాగా పుంజుకుంది. బెస్ట్‌ టాలెంట్‌ను ఒడిసిపట్టేందుకు కంపెనీలు తెలివైన వారికి ఆకర్షించేందుకు ఆఫర్లు ఇస్తున్నారు' అని నివేదిక వెల్లడించింది.

'అట్రిషన్‌ రేటు పెరుగుతుండటంతో టాలెంట్‌ కొరత ఏర్పడుతోంది. మంచి నైపుణ్యాలు ఉన్న వారి వేతనాలు పెంచేందుకు ఇది దోహదం చేస్తోంది. వారికి ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ప్రతిభ ఉన్నవారినే కాకుండా నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ బాగున్నవారిని కంపెనీలు తీసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్‌ వాతావరణం, ఉద్యోగి సంక్షేమం కోరే కంపెనీలకే ఉద్యోగులు ఓటేసే అవకాశాలు ఎక్కువ' అని మైకేల్‌ పేజ్‌ ఇండియా ఎండీ అంకిత్‌ అగర్వాల అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు