ప్రముఖ ఎస్‌యూవీ మాడల్ లపై మొత్తంగ సుమారు రూ. 6 లక్షల వరకు భారీ తగ్గింపును ఆడి కార్స్ ఆఫర్ చేస్తోంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కార్ల ప్రియులకు, వినియోగదారులకు కళ్ళు చెదిరే బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ ఎస్‌యూవీ మాడల్ లపై మొత్తంగ సుమారు రూ. 6 లక్షల వరకు భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
'లిమిటెడ్ పీరియడ్ సెలబ్రేటరీ ప్రైస్' ఆఫర్‌లోభాగంగా ఐకానిక్ మోడల్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. 2009లో ఇండియాలో లాంచ్ చేసిన పాపులర్ క్యూ 5, క్యూ 7 ఎస్‌యూవీల ధరలను రూ .6.02 లక్షల వరకు తగ్గించింది.
also read 300 విమానాలను ఆర్డర్ చేసిన ఇండిగో...
ఆడి పోర్ట్‌ఫోలియో నుండి బాగా ప్రాచుర్యం పొందిన ఈ రెండు మోడళ్ల కార్లు భారతదేశంలో లాంచ్ చేసి దశాబ్దం పూర్తి కావడంతో, ఆడి కార్లను ప్రేమించే కస్టమర్లకు ప్రత్యేక ధరల గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామని తెలిపింది.
ఆఫర్ కింద, పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలోని ఆడి క్యూ 5 ప్రస్తుత ధర రూ .55.8 లక్షలు. అయితే ఆఫర్ కింద ఇది రూ .49.99 లక్షలకే లభ్యం కానుంది. మొత్తంగా దీని తగ్గింపు ధర రూ. 5.81 లక్షలు అన్నమాట. క్యూ 7 పెట్రోల్ వెర్షన్ ధర ప్రస్తుతం రూ .73.82 లక్షలతో పోలిస్తే ఆఫర్ కింద రూ .4.83 తగ్గింపుతో రూ .68.99 లక్షలకు లభిస్తుంది.
క్యూ 7 డీజిల్ ఆప్షన్ కారును రూ .71.99 లక్షలకు అందుబాటులో ఉంచింది. అయితే దీని అసలు ధర ధర రూ .78.01 లక్షలు. దీని తగ్గింపు ధర రూ .6.02 లక్షలు
also read చైనాలో మొదలైన 5G సేవలు: ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా ?
ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, 2009 లో భారతదేశంలో మార్కెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి, క్యూ 5, క్యూ 7 కార్లు మంచి ప్రజాదరణ పొందాయనీ, ప్రధానంగా ఇండియలో ఆడి బ్రాండ్ విజయానికి ఇవి మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. ఆఫర్ శుక్రవారం ప్రారంభం నుండి కాగా స్టాక్ కొనసాగే వరకు ఈ ఆఫర్ కొనసాగుతుందని ఆడి తెలిపింది.