బ్యాంకు కస్టమర్లపై మళ్ళీ ఏ‌టి‌ఎం చార్జీల మోత...?

By Sandra Ashok KumarFirst Published Jul 1, 2020, 5:07 PM IST
Highlights

 ఏ బ్యాంకు ఏ‌టి‌ఎం నుంచి అయిన నగదును ఉపసంహరించుకునేందుకు డెబిట్ కార్డుదారులకు మూడు నెలల పాటు ఛార్జీలు ఉండవని సీతారామన్ లాక్ డౌన్ ముందు స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు ఎటిఎం లావాదేవీల కోసం డెబిట్ కార్డ్ లావాదేవీలపై చార్జీల మినహాయింపు కల్పించింది, ఎందుకంటే దీని వల్ల వినియోగదారులు వారి సమీప ఎటిఎం నుండి నగదు ఉపసంహరించుకునేల ప్రోత్సహించింది.

కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 24న ఏటిఎంలలో క్యాష్ విత్ డ్రా ఛార్జీలు, బ్యాంకు లావాదేవీలకు మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ మినహాయింపు మూడు నెలలు మాత్రమే అని జులై ఒకటి నుంచి యధావిధిగా ఛార్జీలు ఉంటాయని తెలిపింది.

ఏ బ్యాంకు ఏ‌టి‌ఎం నుంచి అయిన నగదును ఉపసంహరించుకునేందుకు డెబిట్ కార్డుదారులకు మూడు నెలల పాటు ఛార్జీలు ఉండవని సీతారామన్ లాక్ డౌన్ ముందు స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు ఎటిఎం లావాదేవీల కోసం డెబిట్ కార్డ్ లావాదేవీలపై చార్జీల మినహాయింపు కల్పించింది, ఎందుకంటే దీని వల్ల వినియోగదారులు వారి సమీప ఎటిఎం నుండి నగదు ఉపసంహరించుకునేల ప్రోత్సహించింది.

కానీ ఈ మినహాయింపును మళ్ళీ పొడిగిస్తుందో లేదో మాకు తెలియదు, "అని హిటాచీ పేమెంట్ సర్వీస్,  క్యాష్ బిజినెస్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రుస్తోమ్ ఇరానీ నిన్న అన్నారు. సాధారణంగా బ్యాంకులు తమ సొంత ఎటిఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలను, ఇతర బ్యాంకుల ఎటిఎంలలో మూడు ఉచిత లావాదేవీలను అనుమతిస్తాయి. దీనికి మించిన ప్రతి లావాదేవీ చేస్తే మీకు ఛార్జీలు వసూలు చేస్తాయి. సుమారు రూ.8 నుండి రూ.20 మధ్య ఛార్జీలు విధిస్తుంటాయి.

also read  

ఈ ఛార్జీలు విధించటానికి కారణం ఏమిటంటే, మీరు మీ బ్యాంకు ఏ‌టి‌ఎం నుండి వేరే ఏ‌టి‌ఎం నుండి లావాదేవీలు చేసిన ప్రతిసారీ, బ్యాంక్ ఏటిఎమ్‌ విత్ డ్రాలు నిర్వహించే బ్యాంకు లేదా కంపెనీకి ఇంటర్‌చేంజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏ‌టి‌ఎం ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ డైరెక్టర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఎటిఎం లావాదేవీలు భారీగా తగ్గిపోయాయి.

లాక్ డౌన్ క్రమంగా దేశవ్యాప్తంగా ఎత్తివేయబడడంతో   ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి అని అన్నారు. మార్చిలో సీతారామన్ చేసిన మరో ముఖ్యమైన ప్రకటన బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ చార్జీలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. చాలా బ్యాంకులు ఖాతాదారుడి నుండి కనీస బ్యాలెన్స్ ఉండాలని కోరుతాయి లేదంటే చార్జీలను వసూల్ చేస్తుంది.

కనీస బ్యాలెన్స్ 5,000-10,000 వరకు ఉంటుంది లేదా ప్రీమియం ఖాతా అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏటీఎం నగదు ఉపసంహరణలు సహా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పలు నిబంధనలు బుధవారం (జూలై 1) నుంచి మారనున్నాయి.

కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా బ్యాంకు లావాదేవీల నిర్వహణలో ప్రజలకు మూడు నెలలపాటు ఇచ్చిన మినహాయింపుల గడువు మంగళవారంతో ముగియడంతో మళ్లీ పాత నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో నెలవారీ పరిమితి దాటిన తర్వాత జరిపే ఏటీఎం, ఇతర లావాదేవీలపై బ్యాంకు చార్జీలు వసూలుచేసే అవకాశమున్నది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

click me!