కరోనా వైరస్ నిర్మూలన కోసం సురక్షితమైన వ్యాక్సిన్ రావడానికి చాలాకాలం పట్టవచ్చని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. ఈ మహమ్మారితో మరికొన్నేళ్లు పోరు చేయక తప్పదని ఆమె అభిప్రాయ పడ్డారు. హెల్త్‌కేర్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం ఉన్నదని గుర్తుచేశారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నిర్మూలన కోసం సురక్షితమైన వ్యాక్సిన్ రావడానికి చాలాకాలం పట్టవచ్చని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. ఈ మహమ్మారితో మరికొన్నేళ్లు పోరు చేయక తప్పదని ఆమె అభిప్రాయ పడ్డారు. హెల్త్‌కేర్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం ఉన్నదని గుర్తుచేశారు.
శనివారం కార్ప్‌గిని సంస్థ ‘ఫార్మా-హెల్త్‌కేర్ రంగాలు, అనిశ్చిత పరిస్థితుల్లో వినియోగదారులతో మమేకం, కొవిడ్-19 అనంతర వ్యాపార విధానం’ అనే అంశంపై నిర్వహించిన ఓ వెబినార్‌లో కిరణ్ మజుందార్ షా మాట్లాడారు.
also read:తెలివిగా ‘లాక్ డౌన్’ నుంచి బయటపడాలి.. లేదంటే చేటు తథ్యం:ఎస్బీఐ
‘కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్ రావడానికి చాలా కాలమే పడుతుందని మనం నమ్మాలి. ఇక యావత్ దేశానికి ఇది అందుబాటులోకి రావాలంటే మరెంతో సమయం కావాలి. వ్యాక్సిన్ అభివృద్ధి ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ అని మనం అర్థం చేసుకోవాలి. మందు అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగేైళ్లయినా పడతుంది’ షా అన్నారు.
ఈ క్రమంలోనే ఏడాదిలోగా వ్యాక్సిన్‌ను తీసుకురావడం చాలా కష్టమని కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ ఆవిష్కరణను రక్షణ, సామర్థ్యం, ఓర్పుతో కూడిన ప్రక్రియగా అభివర్ణించారు.
అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీతా రెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కొరతను కరోనా వైరస్ స్పష్టంగా తెలియజేసిందని అన్నారు. భారతీయ హెల్త్‌కేర్ రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశాలున్నాయని, మౌలిక రంగంపైనేగాక నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దేశంలో ఐటీ రంగాభివృద్ధికి ఎలాంటి ప్రేరణను ఇస్తున్నారో.. అలాగే హెల్త్‌కేర్ రంగంలో అదనపు మౌలిక వసతుల కల్పనకూ పెద్దపీట వేయాలన్నారు. తదుపరి ఐటీ రంగంగా హెల్త్‌కేర్‌ను ప్రభుత్వం భావిస్తుందని సునీతారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.