SBI లో హోం లోన్ తీసుకొని ఈఎంఐ కడుతున్నారా, అయితే ఇది మీకు బ్యాడ్ న్యూస్, నేటి నుంచి పెరగనున్న EMI భారం..

Published : Nov 15, 2022, 07:35 PM IST
SBI లో హోం లోన్ తీసుకొని ఈఎంఐ కడుతున్నారా, అయితే ఇది మీకు బ్యాడ్ న్యూస్, నేటి నుంచి పెరగనున్న EMI భారం..

సారాంశం

SBI కనీస రుణ వడ్డీ రేటును MCLR పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రుణగ్రహీతలపై ఈఎంఐ భారం పెరిగింది. SBI MCLRని 10-15 బేసిస్ పాయింట్లు పెంచింది. నేటి నుండి ఈ సవరించిన రేట్లు అమలులోకి రానున్నాయి. దీంతో MCLRతో అనుసంధానించబడిన రుణాలపై EMI మొత్తం పెరగనుంది.  

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణాలపై కనీస వడ్డీ రేటు లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR) 10-15 శాతం పెంచింది. సవరించిన రేటు నేటి నుంచి అంటే నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. ఇది MCLRతో అనుసంధానించబడిన రుణాలపై EMI మొత్తాన్ని పెంచుతుంది. దీంతో రుణగ్రహీతలపై మరింత భారం పడుతుంది. 

ఒక నెల, మూడు నెలల MCLR రేటు 7.60% నుండి 7.75% కి పెరిగింది. అలాగే, ఆరు నెలలు,  ఒక సంవత్సరానికి MCLR రేటును 7.90 శాతం నుండి 8.05 శాతానికి పెంచారు. రెండేళ్ల వరకు ఎంసీఎల్‌ఆర్‌ రేటును 8.15 శాతం నుంచి 8.25 శాతానికి పెంచారు. మూడేళ్ల వరకు MCLR రేటు 8.25% నుండి 8.35% కి పెరిగింది. ఇప్పటికే గృహ రుణాలు సహా పలు రుణాలపై వడ్డీ రేట్లు పెరగడంతో షాక్ కు గురైన ఎస్బీఐ రుణగ్రహీతలకు మరోసారి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 

MCLR అంటే ఏమిటి?
మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే కనీస వడ్డీ రేటు. వివిధ రకాల రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించడానికి RBI 2016లో MCLRని ప్రవేశపెట్టింది. సరళంగా చెప్పాలంటే, MCLR అనేది రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు అనుసరించే  ప్రామాణిక వడ్డీ రేటు. ఈ పద్ధతిలో లోనుపై వడ్డీని నిర్ణయించడానికి కనీస రేటును అనుసరిస్తారు. దీని కంటే తక్కువ రేటుకు బ్యాంకులు రుణాలు ఇవ్వవు. 

లోనుపై ప్రత్యక్ష ప్రభావం
MCLR రేటులో ఏదైనా మార్పు నేరుగా రుణాన్ని ప్రభావితం చేస్తుంది. ఎంసీఎల్‌ఆర్‌ను పెంచడం వల్ల రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. దీని కారణంగా, రుణగ్రహీతల EMI మొత్తం కూడా పెరుగుతుంది. మీరు ఇప్పటికే SBI నుండి కనీస వడ్డీ రేటుకు లోను తీసుకున్నట్లయితే, తిరిగి చెల్లించే తేదీ రాగానే వడ్డీ రేటులో తేడా తెలుస్తుంది. అదే కనీస వడ్డీ రేటుతో కొత్త లోన్ తీసుకున్నట్లయితే, EMI మొత్తం ప్రారంభం నుండి పెరుగుతుంది. 

MCLR పెరుగుదలకు కారణం ఏమిటి?
ఆర్‌బీఐ రెపో రేటును పెంచినప్పుడు బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేటును పెంచుతాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగుసార్లు రెపో రేటును పెంచింది. రెపో రేటు మొత్తం 190 బేసిస్ పాయింట్లు పెరిగి 5.90 శాతంగా ఉంది. ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు ఇప్పటికే రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. SBI ఇప్పుడు లోనుపై కనీస వడ్డీ రేటును కూడా పెంచింది. 

EMI భారాన్ని ఎలా తగ్గించుకోవాలి?
గృహ లోనుపై EMI భారాన్ని తగ్గించుకోవడానికి, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలి లేదా లోన్ కాలపరిమితిని పొడిగించాలి. ఇలా చేయడం ద్వారా, EMI అమౌంట్‌లో పెరుగుదలను నివారించవచ్చు. 

 

PREV
click me!

Recommended Stories

Cheapest EV bike: చవక ధరకే ఏథర్ ఈవీ బైక్.. ఇలా అయితే ఓలాకు కష్టమే
Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి