
ఈ ఏడాది ప్రథమార్ధంలో(జనవరి-జూన్) భారతీయ దేశీయ ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ విలువ 7.15 బిలియన్ల యూఎస్ డాలర్లకు చేరింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ వివరాలను వెలువరించింది. ఈయర్ ఓవర్ ఈయర్ వృద్దిరేటు 7.4 శాతంగా ఉందని.. ఇది 2021 ప్రథమార్దంలో 6.4గా ఉందని తెలిపింది. భారతీయ ఎంటర్‌ప్రైజెస్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొనసాగుతున్న పెరుగుదల కారణంగా అధిక వృద్ధి రేటు నమోదైందని తెలిపింది.
‘‘కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ వివాదం ఉన్నప్పటికీ.. సంస్థలకు స్థితిస్థాపకతను మెరుగుపరచడం, కస్టమర్ సంతృప్తిని పెంచడం, ఉత్పత్తి అభివృద్ధిని వేగవంతం చేయడం మొదలైన వాటి కోసం.. తమ ఐటీ సేవా పెట్టుబడులను పెంచడం కొనసాగించడంతో భారతీయ ఐటీ సేవల మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేసింది.
మహమ్మారి కారణంగా నిలిపివేసిన ఐటీ పెట్టుబడులు పునఃప్రారంభించబడటంతో డిజిటల్ పరివర్తన కార్యక్రమాలతో పాటు, విచక్షణ ఖర్చులు కూడా పెరుగుతాయి. క్లౌడ్‌లో పెట్టుబడులు పెరుగుతూనే ఉండటంతో మెరుగైన నిర్ణయం తీసుకోవడం, ఐటీ భద్రత కోసం (మొత్తం భద్రతా స్థితిని మెరుగుపరచడానికి) ఎంటర్‌ప్రైజెస్ డేటా అనలిటిక్స్, ఏఐ/ఎంఎల్లో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుంది’’ అని ఐడీసీ ఇండియా ఐటీ సర్వీసెస్ సీనియర్ మార్కెట్ విశ్లేషకులు హరీష్ కృష్ణకుమార్ చెప్పారు.
ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ మార్కెట్‌లలో ఐటీ సర్వీసెస్ మార్కెట్ 78.5 శాతం సహకారం అందించింది. 2021 ప్రథమార్ధంలో 7.3 శాతం వృద్దితో పోలిస్తే.. 2022 ప్రథమార్ధంలో 8.1 శాతం పెరిగింది. ఐడీసీ ప్రకారం.. ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో బలమైన వృద్ధిని నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంటర్‌ప్రైజెస్ తమ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కొనసాగాలని భావించండం, ఆర్థిక మందగమనం కారణంగా గణనీయమైన ప్రభావాన్ని ఎదుర్కోకపోవడమే ఇందుకు కారణమవుతాయని పేర్కొంది. ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ 2021-2026 మధ్య 8.3 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు వద్ద వృద్ధి చెందుతుందని, 2026 చివరి నాటికి 20.5 బిలియన్ల యూఎస్ డాలర్లకు అంచనా చేరుతుందని అంచనా వేసింది.
ఇక, ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ మార్కెట్‌ను ఐడీసీ మూడు ప్రాథమిక మార్కెట్‌లుగా వర్గీకరిస్తుంది. అవి.. ప్రాజెక్ట్-ఓరియెంటెడ్, మేనేజ్డ్ సర్వీసెస్, సపోర్ట్ సర్వీసెస్. 2022 ప్రథమార్దంలో ప్రాజెక్ట్-ఓరియెంెడ్ సేవలు అత్యధిక వృద్ధి రేటును 8.1 శాతంగా నమోదు చేశాయి. మేనేజ్డ్ సర్వీసెస్ 7.3 శాతం, సపోర్ట్ సర్వీసెస్ 6.0 శాతంగా వృద్దిని కలిగి ఉన్నాయి.
హోస్టెడ్ అప్లికేషన్ మేనేజ్‌మెంట్, హోస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవలకు పెరిగిన డిమాండ్ కారణంగా మేనేజ్డ్ సర్వీసెస్ మార్కెట్ వృద్ది సాధిస్తుంది. ప్రాజెక్ట్-ఓరియెంటెడ్ సేవల మార్కెట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ సేవల డిమాండ్ ద్వారా వృద్ది సాధిస్తుంది. ఇక, ఎంటర్‌ప్రైజెస్ తమ ఐటీ పెట్టుబడులు వారు కోరుకున్న వ్యాపార ఫలితాలతో సమలేఖనం అయ్యేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నందున ఐటీ కన్సల్టింగ్ సేవలకు డిమాండ్ కూడా పెరుగుతోంది.
‘‘అధునాతన సాంకేతికతలను అవలంబిస్తున్న సంస్థలతో సంప్రదాయ సంస్థాగత సరిహద్దులు అస్పష్టంగా మారుతున్నాయి. మారుతున్న వ్యాపార కోణానికి అనుగుణంగా సంస్థలు తమ ఆపరేటింగ్ నమూనాలను మారుస్తున్నాయి. ఫలితంగా ఐటీ సేవలకు డిమాండ్ గతంలో ఎన్నడూ లేనంతగా ఉంది. ఐడీసీ ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజ్ రెసిలెన్స్ అండ్ స్పెండింగ్ సర్వే వేవ్ 2 2022 మార్చి ప్రకారం.. 60 శాతం ఎక్కువ భారతీయ సంస్థలు ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడర్‌ల నుంచి సర్వీస్ ప్రొవైడర్‌గా ఒప్పందం చేసుకున్న అన్ని బిజినెస్ అండ్ ఐటీ సర్వీసులలో తమ బడ్జెట్‌లను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి.
భవిష్యత్ ఎంటర్‌ప్రైజ్‌గా అవతరించే వారి లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నప్పుడు భారతీయ సంస్థలు తమ సర్వీస్ ప్రొవైడర్ల వైపు దృష్టి సారిస్తుండటంతో ఈ ట్రెండ్ కొనసాగడం మేము చూస్తున్నాం’’ అని ఐడీసీ ఇండియా సాఫ్ట్‌వేర్ అండ్ ఐటి సర్వీసెస్ మార్కెట్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ నేహా గుప్తా అన్నారు.