పండగ ముందు బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే భారీగా తగ్గిన బంగారం ధర..చెక్ చేసుకోండి..

By Krishna AdithyaFirst Published Sep 18, 2022, 10:55 AM IST
Highlights

స్టాక్ మార్కెట్లో బంగారం ఒక ముఖ్యమైన పెట్టుబడి కాబట్టి, బంగారం ధర ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతుంది. మరి ఈరోజు బంగారం, వెండి ఆభరణాల ధర ఎంతుందో చూద్దాం...

దసరా, దీపావళి లాంటి పండగలు వస్తున్నాయి. అలాగే పెళ్లిల్ల సీజన్ కూడా ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేస్తున్నారా, అయితే మీరు చకచకా పసిడి ధరలు తెలుసుకోండి. తద్వారా మీరు మార్కెట్ కు వెళ్లే ముందు ధరలు సరిపోల్చుకోవచ్చు. 

బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి ముఖ్యంగా పండుగని సీజన్ నేపథ్యంలో బంగారం ధరలో భారీగా పెరుగుతాయని బులియన్ విశ్లేషకుడు అంచనా వేస్తున్నారు అయితే అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా చూసినట్లయితే బంగారం ధరలు అంతగా పెరగలేదు. ప్రస్తుతం చూసినట్లయితే భారత మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా సాగుతున్నాయి. గరిష్ట స్థాయి అయినటువంటి రూ. 56000 నుంచి బంగారం ధరలు, ప్రస్తుతం 50 నుంచి 51 వేల రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు బంగారం కొనాలని చూస్తున్నారా అయితే ఏ నగరంలో బంగారం ధర తక్కువ ఉందో తెలుసుకోండి.

మీరు బంగారం కొనుగోలు చేస్తే, ఈ రోజు ఇక్కడ తాజా ధర ఎంత అంటే, 18 సెప్టెంబర్ 2022న, బులియన్ మార్కెట్‌లో కొత్త బంగారం ధరలు విడుదలయ్యాయి. భారతదేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మరియు 24 క్యారెట్ల బంగారం ధరలను ఇక్కడ చెక్ చేసుకుందాం. 

హైదరాబాద్ లో 18 సెప్టెంబర్ 2022న, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,100 పలుకుతోంది, ఇక ఏపీ రాజధాని విజయవాడలో  24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 50,280 పలుకుతోంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,130గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది.

స్వచ్ఛమైన బంగారాన్ని ఎలా గుర్తించాలి
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్క్ గుర్తు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా బంగారు నగలకు ఉపయోగిస్తున్నారు.

నేటి వెండి ధర: భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ వ్యత్యాసాలు, డాలర్‌తో రూపాయి పనితీరుపై ఆధారపడి ఉంటుంది, ఇది దేశీయ బంగారం-వెండి ధరలను ప్రభావితం చేస్తుంది. రూపాయి విలువ పెరగడం, తగ్గడం వల్ల బంగారం, వెండి ధరలు కూడా మారుతూ ఉంటాయి. ఈరోజు వెండి ధర స్వల్పంగా పెరిగింది.

వెండి ధర హైదరాబాద్ లో  1 కిలో ధర రూ. 62,000గా నమోదైంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ. 62,000, ముంబైలో రూ.56,700, కోల్‌కతాలో కూడా రూ. 56,700 ఉన్నాయి. అలాగే దేశ రాజధాని న్యూఢిల్లీలో నేటి వెండి ధర రూ. 56,400 ఉంది.

 

click me!