నేడు ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్ 21 పైసలు, డీజిల్ 20 పైసలు తగ్గింపు..

By asianet news teluguFirst Published Sep 17, 2022, 9:24 AM IST
Highlights

ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన తాజా రేటు ప్రకారం ఢిల్లీ, ముంబై సహా దేశంలోని నాలుగు మెట్రో నగరాలలో ఇంధన ధరలో నేటికీ ఎటువంటి మార్పు లేదు. అయితే యూపీలోని పలు నగరాల్లో ధరలు మారాయి. 

న్యూఢిల్లీ. ముడిచమురు ధరల్లో పతనం కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర నేడు బ్యారెల్‌కు 91 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం తగ్గుతున్న ముడి చమురు ధరల ప్రభావం దేశీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కనిపించడం లేదు. 

ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన తాజా రేటు ప్రకారం ఢిల్లీ, ముంబై సహా దేశంలోని నాలుగు మెట్రో నగరాలలో ఇంధన ధరలో నేటికీ ఎటువంటి మార్పు లేదు. అయితే యూపీలోని పలు నగరాల్లో ధరలు మారాయి. నోయిడా-గ్రేటర్ నోయిడాలో శుక్రవారం పెట్రోల్ ధర 4 పైసలు పెరిగి రూ.96.69కి చేరగా, డీజిల్ ధర 4 పైసలు పెరిగి రూ.89.86కి చేరుకుంది. ఘజియాబాద్‌లో పెట్రోలు ధర లీటర్‌కు 35 పైసలు తగ్గి రూ.96.23కి చేరగా, డీజిల్ 33 పైసలు తగ్గి రూ.89.42కి చేరుకుంది. లక్నోలో లీటర్ పెట్రోల్ 21 పైసలు తగ్గి రూ.96.36కి, డీజిల్ 20 పైసలు తగ్గి రూ.89.56కి చేరుకుంది.

మెట్రో నగరాల్లో నేడు పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ రూ. 96.72, డీజిల్ లీటరుకు రూ. 89.62
 - ముంబైలో పెట్రోల్ రూ. 106.31, డీజిల్ రూ. 94.27 
- చెన్నైలో పెట్రోల్ రూ. 102.63, డీజిల్ రూ . 94.24
- కోల్‌కతాలో పెట్రోల్  రూ. 106.03, డీజిల్ లీటరుకు రూ. 92.76
- పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ రూ.94.04గా ఉంది.
–పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ రూ.84.10, డీజిల్ రూ.79.74గా ఉంది.
-హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82

ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి ఇంధన ధరలో ఎలాంటి మార్పు లేదు. మే నెలలో ఇంధన ధరల పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్  ధరలు కాస్త  తగ్గాయి. గతేడాది సెప్టెంబర్ తర్వాత పెట్రోల్ కంటే డీజిల్ మార్కెట్ వేగంగా పెరిగింది. వ్యాపార దృక్కోణంలో డీజిల్ తయారీ పెట్రోల్ కంటే ఖరీదైనది.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ - డీజిల్ ధరలలో సవరణ ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

ఈ విధంగా పెట్రోల్ -డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు
ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSP ఇంకా వారి సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు, HPCL కస్టమర్‌లు HPPrice సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

click me!