నేడు బంగారం ధరలు ఇలా.. నిన్నటితో పోల్చితే నేడు పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Sep 17, 2022, 9:55 AM IST
Highlights

గత 24 గంటల్లో భారతదేశంలోని మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.
 

భారతదేశంలో బంగారం ధర సెప్టెంబర్ 17న 24 క్యారెట్లు, 22 క్యారెట్లకు తగ్గుతూనే ఉంది. శనివారం నాడు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 49,960 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.45,800.

గత 24 గంటల్లో భారతదేశంలోని మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,120 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 46,950. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 49,960 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 45,800. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.49,960 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)ధర  రూ.45,800గా ఉంది.


హైదరాబాద్‌లో బంగారం ధర నిన్నటి నుంచి భారీగా తగ్గింది. స్టాండర్డ్ గోల్డ్ ధర రూ. రూ. 10 గ్రాములకు 540 తగ్గి రూ. 46,260కి, ప్యూర్ గోల్డ్ ధర రూ. 570 తగ్గి 10 గ్రాములకు రూ. 48,570గా ఉంది.
రూపాయి క్షీణత ఉన్నప్పటికీ కామేక్స్ బంగారం ధరల పతనంతో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.813 తగ్గిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. శుక్రవారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు క్షీణించి 79.78 వద్ద ముగిసింది.

కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్సుకి $1,640 నుండి $1,685 వరకు ట్రేడవుతుందని వారు తెలిపారు.  

బంగారం ధర ఔట్ లుక్
బంగారం ధర పతనానికి గల కారణాలపై ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనూజ్‌ గుప్తా మాట్లాడుతూ, "ఆగస్టులో  యూ‌ఎస్ సి‌పి‌ఐ డేటా నిరాశపర్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. యూ‌ఎస్ ద్రవ్యోల్బణం 0.1 శాతం తగ్గుతుందని మార్కెట్‌ అంచనా వేస్తుండగా, సి‌పి‌ఐ వచ్చే వారం జరగనున్న యూ‌ఎస్ ఫెడ్ సమావేశంలో 100 bps యూ‌ఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెంపుదల గురించి ఊహాగానాలకు దారితీసింది.

స్థానిక ధరలు ఇక్కడ చూపిన వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు. ఈ ధరలు TDS, GST, విధించబడే ఇతర పన్నులను చేర్చకుండా డేటాను చూపుతుంది. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినవి. 

click me!