Arabian Petroleum IPO Listing: మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ,NSE SME ప్లాట్‌ఫారమ్‌లో గ్రీజు-చమురు తయారీదారు అరేబియా పెట్రోలియం షేర్లు మంచి ఎంట్రీని పొందాయి. నేడు కంపెనీ షేర్లు రూ. 77.40 ధరతో ఎంట్రీ ఇచ్చాయి. అంటే IPO పెట్టుబడిదారులు 10.57 శాతం లిస్టింగ్ లాభం పొందారు.
మార్కెట్ క్షీణత నడుమ అరేబియన్ పెట్రోలియం ఐపీవో ద్వారా షేర్లు సోమవారం NSE SME ప్లాట్‌ఫారమ్‌లో మంచి అరంగేట్రం చేశారు. కంపెనీ షేర్లు NSE SMEలో రూ.77.40 వద్ద లిస్ట్ అయ్యాయి, ఇది ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.70 కంటే 10.57 శాతం ఎక్కువ.
IPOకి స్పందన ఎలా ఉంది?
సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో ఇష్యూ 19.91 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినందున అరేబియన్ పెట్రోలియం IPO పెట్టుబడిదారుల నుండి బలమైన ప్రతిస్పందనను అందుకుంది. IPO రిటైల్ కేటగిరీలో 23.19 రెట్లు , ఇతర కేటగిరీలలో 15.72 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. అరేబియన్ పెట్రోలియం రూ. 20.24 కోట్ల IPO సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 25, 2023న ప్రారంభమై సెప్టెంబర్ 27, 2023న ముగిసింది.
గ్రీజ్ ఆయిల్ మేకర్ అయినే ఈ కంపెనీ IPO పూర్తిగా 28.92 లక్షల షేర్ల తాజా ఇష్యూ, మొత్తంగా రూ. 20.24 కోట్లకు చేరుకుంది. IPO ధర ఒక్కో షేరుకు రూ. 70 , కనీస లాట్ పరిమాణం 2,000 షేర్లుగా నిర్ణయించారు. అరేబియన్ పెట్రోలియం IPO కేటాయింపు అక్టోబర్ 5, 2023న ఖరారు చేశారు.
కొత్త షేర్ల ద్వారా సేకరించిన డబ్బును కంపెనీ దేనికి ఉపయోగిస్తుంది?
అరేబియా పెట్రోలియం సేకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు, సంబంధిత ఖర్చులను తీర్చడానికి ఉపయోగిస్తుంది.
కంపెనీ వ్యాపారం ఇదే..
అరేబియా పెట్రోలియం ప్రత్యేక ఇంజిన్ ఆయిల్స్, శీతలకరణి వంటి కందెనలను తయారు చేస్తుంది. దీని ఉత్పత్తులు ఆటోమొబైల్స్, పరిశ్రమలలో ఉపయోగిస్తారు.. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ. 2.88 కోట్లు, ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.14 కోట్లకు పెరిగింది. అదే సమయంలో, 2023 ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.4.86 కోట్లకు పెరిగింది.